...
...
Next Story

వేగంగా కదులుతున్న అర్నబ్ తుపాను.. తెల్లవారుజామున 2-4 గంటల మధ్య తీరం దాటే అవకాశం

Cyclone Arnab : ఆంధ్రప్రదేశ్‌పై అర్నబ్ తుపాను ప్రభావం చూపిస్తోంది. తీర ప్రాంతాల్లో బలంగా గాలులు వీస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. తాజాగా ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సైక్లోన్‌పై కీలక అప్డేట్ ఇచ్చింది.

Published on: Oct 27, 2026, 21:53:56 IST
Advertisement
<p>అర్నబ్ తుపాను  వేగంగా కదులుతున్నదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ  వెల్లడించింది. తుపాను బాహ్య వలయం భూభాగాన్ని తాకుతున్నది.</p>

అర్నబ్ తుపాను వేగంగా కదులుతున్నదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తుపాను బాహ్య వలయం భూభాగాన్ని తాకుతున్నది.

తెల్లవారుజామున 2–4 గంటల మధ్య పూర్తిగా అర్నబ్ తుపాను తీరాన్ని దాటే అవకాశం ఉంది. గడిచిన 6 గంటల్లో గంటకు 18 కిమీ వేగంతో తీవ్ర తుపాన్ కదిలింది. విశాఖపట్నానికి 170కి.మీ., కాకినాడకు 90 కి.మీ., మచిలీపట్నానికి 170 కి.మీ., బాపట్లకు 240 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నది.

దీని ప్రభావంతో బుధవారం ఉదయం వరకు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఈరోజు ఉదయం 8.30గంటల నుంచి 28 ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురిశాయి. 133 ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదైనట్టుగా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

తుపాను ప్రభావంతో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో బుధవారం ఉదయం వరకు భారీ నుండి అతిభారీ వర్షాలు పడుతాయి. కాకినాడ, కోనసీమ, అనకాపల్లి జిల్లాల్లో కూడా ఉదయం వరకు భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని ప్రఖర్ జైన్ వెల్లడించారు.

గంటకు 100-140 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. పూరిళ్లు, రేకుల షెడ్లలో నివసించే వారు దగ్గరలోని పునరావాస కేంద్రాలకు వెంటనే వెళ్ళాలి. మీ ప్రాంతంలోని తుపాన్ సమస్యలకు మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా వేగవంతమైన పరిష్కారం దొరుకుతుంది. అత్యవసర సహాయం కోసం విపత్తుల నిర్వహణ సంస్థ టోల్ ఫ్రీ నంబర్లు 1070, 112, 18004250101లను సంప్రదించండి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks