...
...
Next Story

Cyclone Arnab Alert : అర్నబ్ తుపాను.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

Arnab Cyclone Alert : అర్నబ్ తుపానుతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. దీంతో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Published on: Oct 25, 2026, 17:45:36 IST
Advertisement
<p>బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి తీవ్రరూపం దాల్చుతోంది. సోమవారం నాటికి తూర్పు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇది తుపానుగా మారనుంది. ఈ తుపానుకు ‘అర్నబ్’ (Cyclone Arnab) అని పేరు పెట్టారు.</p>

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి తీవ్రరూపం దాల్చుతోంది. సోమవారం నాటికి తూర్పు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇది తుపానుగా మారనుంది. ఈ తుపానుకు ‘అర్నబ్’ (Cyclone Arnab) అని పేరు పెట్టారు.

భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం, ఈ అల్పపీడన వ్యవస్థ అక్టోబర్ 27న తీవ్ర తుపానుగా, అక్టోబర్ 28 ఉదయానికి అతి తీవ్ర తుపానుగా (Very Severe Cyclonic Storm) రూపాంతరం చెందనుంది. అనంతరం అక్టోబర్ 28న మధ్యాహ్న సమయానికి బాపట్ల - విశాఖపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశముందని అధికారులు తెలిపారు.

తీరం దాటే సమయంలో సముద్రంలో రాకాసి అలలతో పాటు, గంటకు 115 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో భీకర ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

రాయలసీమ పరిధిలోని కడప, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, అనంతపురం జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ఇచ్చింది.

తీవ్ర ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఏపీలోని కాకినాడ, డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks