...
...
Next Story

ఫొటోలు : 'అర్నబ్' తుఫాన్ దాటికి విశాఖ, కాకినాడ విలవిల - ఉప్పెనలా అలలు, భారీగా నష్టం!

అర్నబ్ తుఫాన్ ప్రభావంతో విశాఖపట్నం, కాకినాడ తీరప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఉప్పాడ రోడ్డు ధ్వంసమవ్వగా…. చెట్లు కూలి వాహనాలు నష్టపోయాయి. వేలాది మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రకృతి విధ్వంసం దాటికి భారీగానే నష్టం వాటిల్లిందని అంచనా.

Published on: Oct 28, 2026, 12:46:53 IST
Advertisement
<p>తీవ్ర రూపం దాల్చిన 'అర్నబ్' తుపాను ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలను భయాందోళనకు గురిచేసింది. తీరం దాటే క్రమంలో విరుచుకుపడిన భయంకరమైన గాలులు, ఉప్పెనలా ఎగసిపడిన సముద్ర అలల దాటికి విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లింది. తుపాను తీవ్రతను ప్రతిబింబించే దృశ్యాలు క్షేత్రస్థాయిలో పరిస్థితుల తీవ్రతకు అద్దం పడుతున్నాయి.</p><p> </p>

తీవ్ర రూపం దాల్చిన 'అర్నబ్' తుపాను ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలను భయాందోళనకు గురిచేసింది. తీరం దాటే క్రమంలో విరుచుకుపడిన భయంకరమైన గాలులు, ఉప్పెనలా ఎగసిపడిన సముద్ర అలల దాటికి విశాఖపట్నం, కాకినాడ జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లింది. తుపాను తీవ్రతను ప్రతిబింబించే దృశ్యాలు క్షేత్రస్థాయిలో పరిస్థితుల తీవ్రతకు అద్దం పడుతున్నాయి.

విశాఖపట్నం తీరంలో బుధవారం ఉదయం నుంచే వాతావరణం అత్యంత భయంకరంగా మారింది. గంటకు వంద కిలోమీటర్లకు పైగా వేగంతో వీచిన ఈదురుగాలులకు విశాఖ తీరానికి రాకాసి అలలు పోటెత్తాయి. గాలుల ధాటికి నగరంలో పలుచోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. నగర వీధుల్లో నిలిపి ఉంచిన పలు వాహనాలపై చెట్లు కూలిపోవడంతో అవి తీవ్రంగా ధ్వంసమయ్యాయి. విశాఖపట్నంలోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్ స్తంభించిపోవడంతో సహాయక బృందాలు రంగంలోకి దిగి చెట్లను తొలగించే చర్యలు చేపట్టాయి.

కాకినాడ హార్బర్‌లో మత్స్యకారులు తమ వేట పడవలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చి లంగర్లు వేసి కట్టివేశారు.

బలమైన ఈదురుగాలుల దాటికి కాకినాడ బీచ్ ప్రాంతంలో దెబ్బతిన్న రోడ్లు

సముద్రంలో చెలరేగిన తీవ్ర అలజడి కారణంగా రాకాసి అలలు ఒడ్డుకు విరుచుకుపడ్డాయి. సముద్రపు నీరు ఉప్పెనలా ముందుకు రావడంతో ప్రసిద్ధ ఉప్పాడ కోస్టల్ రహదారి తీవ్రంగా దెబ్బతిని తునాతునకలైంది. రహదారిపైకి భారీగా సముద్రపు నీరు, ఇసుక చేరడంతో కాకినాడ-ఉప్పాడ మధ్య రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది.

ఇవాళ తుఫాన్ తీరం దాటిన తర్వాత కాకినాడలోని పరిస్థితి

తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న లోతట్టు, తీరప్రాంత ప్రజలను ప్రభుత్వం ముందస్తుగానే సురక్షిత ప్రాంతాలకు తరలించింది. కాకినాడ పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో అత్యవసర పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇళ్లను వదిలి వచ్చిన బాధితులకు ఇక్కడే వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు. ఆశ్రయం పొందుతున్న బాధితులు బట్టలను ఆరబెట్టుకోవడానికి పాఠశాల గదుల లోపలే తాళ్లు కట్టుకుని గడుపుతున్న దృశ్యాలు క్షేత్రస్థాయిలోని కష్టాలను కళ్లకు కడుతున్నాయి.

బాధిత ప్రాంతాల్లో విపత్తు నిర్వహణ బృందాలు, స్థానిక అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. "ప్రజలకు ఎలాంటి ముప్పు రాకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం," అని జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. తుపాను పూర్తిగా సమసిపోయే వరకు ప్రజలు బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

(AP Photo/Mahesh Kumar A.)

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks