...
...
Next Story

AP Telangana Dasara Holidays 2026 : తెలుగు రాష్ట్రాల్లో దసరా పండగ సందడి - నేటి నుంచి విద్యాసంస్థలకు సెలవులు!

AP Telangana Dasara Holidays 2026 : దసరా శరన్నవరాత్రుల వేళ తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలు, కళాశాలలకు సెలవుల సందడి మొదలైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇవాళ్టి నుంచే సెలవులు షురూ అయ్యాయి.

Published on: Oct 10, 2026, 10:03:06 IST
Advertisement
<p>ఏపీ, తెలంగాణలోని పాఠశాలలు కాలేజీలకు శనివారం(నేటి) నుంచి దసరా సెలవులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే పునఃప్రారంభ తేదీలను కూడా ప్రభుత్వాలు ప్రకటించాయి.</p>

ఏపీ, తెలంగాణలోని పాఠశాలలు కాలేజీలకు శనివారం(నేటి) నుంచి దసరా సెలవులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే పునఃప్రారంభ తేదీలను కూడా ప్రభుత్వాలు ప్రకటించాయి.

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ 2026-27 విద్యా సంవత్సర క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 12 నుంచి 21 వరకు దసరా సెలవులను ప్రకటించింది. అయితే అక్టోబర్ 10 రెండో శనివారం, అక్టోబర్ 11 ఆదివారం కావడంతో విద్యార్థులకు రెండు రోజులు ముందే సెలవులు లభించాయి. దీంతో శనివారం (అక్టోబర్ 10) నుంచే బడులకు సెలవులు అమల్లోకి వచ్చాయి. దసరా విరామం తర్వాత అక్టోబర్ 22వ తేదీన పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి.

తెలంగాణలోనూ ఇవాళ్టి నుంచే దసరా సెలవులు ప్రారంభమయ్యాయి. అయితే విద్యాసంస్థల రకాన్ని బట్టి పునఃప్రారంభ తేదీల్లో వ్యత్యాసం ఉంది:

పాఠశాలలు : అక్టోబర్ 22 వరకు సెలవులు కొనసాగుతాయి. అక్టోబర్ 23న బడులు తెరుచుకుంటాయి.

జూనియర్ కళాశాలలు: ఇంటర్మీడియట్ విద్యార్థులకు అక్టోబర్ 21 వరకు విరామం ఉంటుంది. అక్టోబర్ 22న జూనియర్ కాలేజీలు ప్రారంభమవుతాయి.

డిగ్రీ కళాశాలలు: తెలంగాణలోని డిగ్రీ విద్యార్థులకు అక్టోబర్ 25 వరకు దసరా వెకేషన్ ఇచ్చారు. అక్టోబర్ 26న కళాశాలలు రీఓపెన్ అవుతాయి.

అంగన్వాడీ కేంద్రాలు : అంగన్వాడీలకు కూడా అక్టోబర్ 10 నుంచి 21 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. తిరిగి అక్టోబర్ 22న కేంద్రాలు పనిచేస్తాయి.

ఇక మైనార్టీ విద్యా సంస్థల విషయంలో పలు మార్పులు ఉన్నాయి. సాధారణ పాఠశాలల మాదిరిగా కాకుండా… ఆయా విద్యాసంస్థలకు సెలవులు లేవు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks