...
...
Next Story

సంక్రాంతి మహోత్సవాలు 2026 : నా గుండెల్లో పిఠాపురం ఉంటుంది - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురంలో పర్యటించారు. ఓ. బి. ఎస్ మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమైన పీఠికాపుర సంక్రాంతి మహోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు హస్తకళలు, చేనేత కళలు గొప్పదనాన్ని చాటేలా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు. ఫొటోలపై ఓ లుక్కేయండి….

Published on: Jan 9, 2026, 14:16:01 IST
Advertisement
<p>ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురంలో పర్యటించారు. ఓ. బి. ఎస్ మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమైన పీఠికాపుర సంక్రాంతి మహోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు హస్తకళలు, చేనేత కళలు గొప్పదనాన్ని చాటేలా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు.</p>

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురంలో పర్యటించారు. ఓ. బి. ఎస్ మున్సిపల్ హైస్కూల్ ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమైన పీఠికాపుర సంక్రాంతి మహోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు హస్తకళలు, చేనేత కళలు గొప్పదనాన్ని చాటేలా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించారు.

ఆదివాసీ మహిళలతో కలిసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాసేపు స్టెప్పులు వేశారు.

చేతితో నూలు వడకడానికి ఉపయోగించే రాట్నంతో ఏర్పాటు చేసిన స్టాల్ ను పవన్ కల్యాణ్ పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కల్యాణ్… తెలంగాణ ప్రజలకు ఆంధ్రప్రజల ప్రేమను తీసుకెళ్లండంటూ పిలుపునిచ్చారు.

“పిఠాపురంలో చిన్న చెట్టు మీద పక్షి ఈక రాలిపడినా పెద్ద వార్త అయిపోతుంది, తాటాకు చప్పుడు కూడా వైరల్ చేస్తున్నారు. ఎవరో వచ్చి ఇక్కడ ప్రజల మధ్య సంబంధాలు చెడగొట్టాలని చూస్తున్నారు. ప్రజలు గమనించాలి. ఇతర ఏ ప్రముఖ నాయకుల నియోజకవర్గాల్లో ఇలా జరగదు. గత ప్రభుత్వ హాయంలో పిఠాపురం నియోజకవర్గానికి ఎన్ని కోట్లు కేటాయించి పనులు చేశారో చూడండి, నేను పిఠాపురం MLA గా గెలిచాక కేవలం తొలి సంవత్సరంలో 308 కోట్లు కేటాయించి ఈ మార్చి నాటికి పనులు కూడా పూర్తి చేసేలా అభివృద్ధి చేపట్టాము. ఇది ప్రజలు గమనించాలి" అని పవన్ కల్యాణ్ కోరారు.

“నాకు ఇక్కడ ఉండటం కంటే కూడా, నేను లేకపోయినా మీ పనులు పూర్తయ్యే వ్యవస్థ ఏర్పాటు చేయడం ముఖ్యం. నేను ఉంటేనే, నన్ను కలిస్తేనే పనులు అవుతాయి అంటే అది పరిపాలన వైఫల్యంగా నేను భావిస్తాను. ఈరోజు పిఠాపురం సింగపూర్ తరహాలో వ్యక్తి మీద ఆధారపడకుండా వ్యవస్థ పనిచేసేలా తీర్చిదిద్దుతున్నాము.నేను పిఠాపురం నుండి గెలిచి జాతీయ స్థాయిలో జనసేన పేరు వినపడేలా పనిచేస్తున్నాను. పిఠాపురం వరకు పరిమితం చేయకండి. నేను పేరంటాలకు, ఫంక్షన్లకు అటెండ్ కావడం కంటే పిఠాపురాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నాను.నేను ఎక్కడా ఉన్నా నా గుండెల్లో పిఠాపురం ఉంటుంది అనే విషయం పిఠాపురం ప్రజలు గుర్తుపెట్టుకోండి” అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

దేశవ్యాప్తంగా గుజరాత్, మహారాష్ట్ర, కేరళ, గోవా, తమిళనాడు, ఒరిస్సా, బెంగాల్ ఇలా ఎన్నో రాష్ట్రాల్లో తీర ప్రాంత గ్రామాలు కోతకు గురవుతుంటే కేవలం పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ ప్రాంతానికి ప్రొటెక్షన్ వాల్ తీసుకురాగలిగాం అంటే అని నాకు పిఠాపురం ప్రజలపై, ఉప్పాడ ప్రజలపైనున్న ప్రేమ" అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

“పీఠికాపురం సంక్రాంతి పండుగకు వేడుక కావాలి. మతాలకు అతీతంగా అందరూ కేరళ ఓనం పండుగ తరహాలో జరుపుకోవాలి. ఈ వారసత్వాన్ని భావితరానికి అందించాలి అని కోరుకుంటున్నాను” అని పవన్ కల్యాణ్ చెప్పారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe