...
...
Next Story

India Vs Srilanka: దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్‌ సూప‌ర్ సెంచ‌రీ.. పాపం కేఎల్ రాహుల్‌.. శ్రీలంక‌తో టెస్టు.. ఇండియా స్కోరు ఎంతంటే?

India Vs Srilanka: శ్రీలంకతో ఫస్ట్ టెస్టులో ఇండియన్ బ్యాటర్లు అదరగొట్టారు. వర్షం దాగుడుమూతలు ఆడిన ఫస్ట్ రోజు ఆటలో మన బ్యాటర్లు సత్తాచాటారు. దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్‌ అన్ బీటెన్ సెంచరీతో చెలరేగాడు. పాపం రాహుల్ మాత్రం రిటైర్డ్ హర్ట్ అయ్యాడు.

Published on: Aug 15, 2026, 18:23:02 IST
Advertisement
<p>శ్రీలంకతో ఫస్ట్ టెస్టులో కర్ణాటక బ్యాటర్ దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్‌ సత్తాచాటాడు. 178 బంతుల్లో 131 పరుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు, ఓ సిక్సర్ ఉన్నాయి. </p>

శ్రీలంకతో ఫస్ట్ టెస్టులో కర్ణాటక బ్యాటర్ దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్‌ సత్తాచాటాడు. 178 బంతుల్లో 131 పరుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు, ఓ సిక్సర్ ఉన్నాయి.

తొలి రోజు ఆటలో కేఎల్ రాహుల్ కు బ్యాడ్ లక్ ఎదురైంది. సెంచరీ చేసేలా కనిపించిన అతను కండరాల నొప్పితో రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. 77 రన్స్ చేసిన కేఎల్ మళ్లీ బ్యాటింగ్ కు వచ్చి సెంచరీ కంప్లీట్ చేస్తాడేమో చూడాలి.

కేఎల్ రాహుల్ తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన యశస్వి జైస్వాల్ మంచి ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు. 32 రన్స్ చేసి రనౌట్ అయ్యాడు.

కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్ తో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శుభ్ మన్ గిల్ నిరాశపరిచాడు. అతను కేవలం 16 రన్స్ మాత్రమే కొట్టాడు.

ఫస్ట్ రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా 73 ఓవర్లలో 2 వికెట్లకు 288 పరుగులు చేసింది. పడిక్కల్ తో పాటు రిషబ్ పంత్ (27) నాటౌౌట్ గా ఉన్నాడు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe