కొత్త రేషన్ కార్డుకు అప్లయ్ చేశారా..? ఇవాళ్టి నుంచే పంపిణీ ప్రారంభం, మీ వివరాలు ఇలా చెక్ చేసుకోండి

కొత్త రేషన్‌ కార్డుల పంపిణీకి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 3.58 లక్షల కార్డులు… లబ్ధిదారులకు అందజేయనున్నారు.

Published on: Jul 14, 2025 11:26 AM IST
google-icon
Share
Share via
• facebook
• twitter
• linkedin
Copy link
• copy link
1/8

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ వచ్చేసింది. నూతన రేషన్ కార్డుల పంపిణీకి ఇవాళ్టి(జూలై)  నుంచి శ్రీకారం చుట్టనుంది. ఇవాళ సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజక వర్గంలోని తిరుమలగిరి లో సీఎం రేవంత్‌‌రెడ్డి రేషన్​కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
expand-iconView Photos in a new improved layout
Published on Jul 14, 2025 11:26 AM

2/8

సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొంత మంది లబ్ధిదారులకు కార్డులను అందజేస్తారు. దీంతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆపై రాష్ట్ర వ్యాప్తంగా  ఆయా జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాలవారీగా కొత్త కార్డులను పంపిణీ చేస్తారు. ఆయా లబ్ధిదారులు కొత్త కార్డులను పొందవచ్చు.

3/8

రాష్ట్రంలో అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా నిర్దేశించిన ప్రజా ప్రభుత్వం కొత్తగా ఈ రేషన్ కార్డులను జారీ చేయనుందని ప్రభుత్వం తాజాగా ప్రకటన విడుదల చేసింది. తిరుమలగిరిలో ఏర్పాటు చేసే బహిరంగ సభ వేదికగా లబ్ధిదారులకు కార్డులను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది.

4/8

రాష్ట్రవ్యాప్తంగా 3.58 లక్షల కార్డులను లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాల వారీగా పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే కార్డులను సిద్ధం చేశారు.

5/8

రేషన్ కార్డు దరఖాస్తుదారుడు https://epds.telangana.gov.in/FoodSecurityAct/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. అంటే లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఇందుకోసం సంబంధింత వెబ్ సైట్లోని హోంపేజీలో 'FSC Search' ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత పేజీలో 'Ration Card Search' డ్రాప్ డౌన్ లో 'FSC Search' ఆప్షన్ పై నొక్కాలి. అనంతరం ఎఫ్ఎస్సీ రిఫరెన్స్ నెంబర్ లేదా పాత రేషన్ కార్డు లేదా ప్రస్తుత రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీ జిల్లాను ఎంపిక చేసి సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. దీంతో మీ రేషన్ కార్డు పూర్తి వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు స్క్రీన్ పై డిస్ ప్లే అవుతాయి. ఈ లిస్ట్ లో పేర్లు ఉంటే… కొత్త కార్డును పంపిణీ చేస్తారు. వివరాలు అందుబాటులో లేకపోతే… వేచి చూడాల్సి ఉంటుంది.

6/8

బీపీఎల్( దారిద్య్ర రేఖకు దిగువ) కుటుంబాలకు మూడు రంగులతో ఉన్న కార్డును అందజేస్తారు. ఏపీఎల్ కుటుంబాలకు పచ్చ కార్డును పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.

7/8

సీఎం చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం ఇవాళ అధికారికంగా ప్రారంభమవుతుండగా… అన్ని జిల్లాల్లోనూ కొత్త రేషన్‌ కార్డులు ఎక్కువగా పంపిణీ చేయబోతున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 50,102 కొత్త రేషన్‌ కార్డులు రాబోతున్నాయి. ఆ తర్వాత కరీంనగర్‌లో 31,772 కొత్త కార్డులను ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.

8/8

కొత్త రేషన్‌ కార్డుల జారీ, పేర్లను చేర్చడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి రూ.1150.68 కోట్ల ఆర్థిక భారం అదనంగా పడుతుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.

Related Photos