
పూల ముగ్గులు, దీపాలంకరణ
ప్రధాన ద్వారం ఎదురుగా పూల ముగ్గులు వేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలాగే దీపాలను కూడా అందంగా ఈ విధంగా పెడితే బాగుంటుంది.
పూజా మందిరం
పూజా మందిరంలో లక్ష్మీదేవిని ఆరాధిస్తాము. ఆరోజు ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాన్ని వేసి అమ్మవారిని అందంగా అలంకరించండి. చుట్టూ దీపాలు, ఫెయిరీ లైట్స్‌ను కూడా అమర్చండి. చాలా బాగుంటుంది!
ప్రధాన ద్వారం అలంకరణ
గుమ్మానికి బంతిపూల దండలు, మామిడి ఆకుల తోరణాలు కట్టండి. ద్వారం రెండు వైపులా వేలాడే దీపాలను పెడితే అందంగా ఉంటుంది. చాలా బాగుంటుంది!
గ్లాస్ జార్ లైట్స్
ఇవి చాలా బాగుంటాయి. చూడడానికి కొత్తగా, ఆకర్షణీయంగా ఉంటాయి. తక్కువ ఖర్చులోనే రిచ్ లుక్ వస్తుంది. దీపావళికి ట్రై చేయండి!
లివింగ్ రూమ్ అలంకరణ
సోఫా వెనక గోడకు ఫెయిరీ లైట్స్‌ను పెట్టండి. రంగురంగుల కుషన్లు, పూలతో నింపిన ఉర్లీలను పెట్టి, అందంగా టేబుల్‌ను అలంకరిస్తే చాలా బాగుంటుంది.