...
...
Next Story

Eye care mistakes : కళ్లు బైర్లు కమ్ముతున్నాయా? మీరు చేసే ఈ చిన్న చిన్న తప్పులే.. మీ చూపుకు శాపం!

నిరంతర స్క్రీన్ సమయం, నిర్లక్ష్యం కారణంగా భారతదేశంలో 69 శాతం మంది పెద్దలు, సగం మంది పిల్లలు డిజిటల్ ఐ స్ట్రెయిన్ బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో కంటి చూపును శాశ్వతంగా దెబ్బతీసే 8 ప్రధాన తప్పులు, అలవాట్ల గురించి ప్రముఖ కంటి వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవి..

Published on: Jul 12, 2026 12:18 PM IST
Advertisement
<p>ప్రస్తుతం భారతదేశంలో డిజిటల్ విప్లవం తెచ్చిన మార్పుల వల్ల చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్క్రీన్లకు అతుక్కుపోతున్నారు. దీనివల్ల దేశంలోని దాదాపు 69 శాతం మంది వయోజనులు, సగానికి పైగా పిల్లలు ‘డిజిటల్ ఐ స్ట్రెయిన్’ (కంటి అలసట) సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆఫీసు డెస్కుల నుంచి క్లాస్‌రూమ్‌ల వరకు, ప్రయాణాల నుంచి పడక గది వరకు స్మార్ట్‌ఫోన్లు, లాప్‌టాప్‌లు నిత్యావసరాలుగా మారడంతో కంటి సమస్యలు నానాటికీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని అలవాట్లు కంటి చూపును ఎలా ప్రమాదంలో పడేస్తున్నాయో షార్ప్ సైట్ ఐ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రష్మి జైస్వాల్ వివరించారు. ఆ వివరాలు మీకోసం..</p>

ప్రస్తుతం భారతదేశంలో డిజిటల్ విప్లవం తెచ్చిన మార్పుల వల్ల చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్క్రీన్లకు అతుక్కుపోతున్నారు. దీనివల్ల దేశంలోని దాదాపు 69 శాతం మంది వయోజనులు, సగానికి పైగా పిల్లలు ‘డిజిటల్ ఐ స్ట్రెయిన్’ (కంటి అలసట) సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆఫీసు డెస్కుల నుంచి క్లాస్‌రూమ్‌ల వరకు, ప్రయాణాల నుంచి పడక గది వరకు స్మార్ట్‌ఫోన్లు, లాప్‌టాప్‌లు నిత్యావసరాలుగా మారడంతో కంటి సమస్యలు నానాటికీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని అలవాట్లు కంటి చూపును ఎలా ప్రమాదంలో పడేస్తున్నాయో షార్ప్ సైట్ ఐ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ రష్మి జైస్వాల్ వివరించారు. ఆ వివరాలు మీకోసం..

కంటి లక్షణాలను తేలికగా తీసుకోవడం- చూపు మసకబారడం, రాత్రి పూట డ్రైవింగ్ చేసేటప్పుడు ఎదురుగా వచ్చే వాహనాల వెలుతురు వల్ల కళ్లు బైర్లు కమ్మడం, తక్కువ కాంతిలో చిన్న అక్షరాలు చదవడానికి ఇబ్బంది పడటం.. ఇవన్నీ చాలామంది సాధారణ అలవాటే అని వదిలేస్తుంటారు. కొద్దిరోజులు పోతే తగ్గిపోతుందని సరిపెట్టుకుంటారు. కానీ, క్యాటరాక్ట్ (కంటి శుక్లాలు), గ్లాకోమా (నీటి కాసులు), లేదా రెటీనా సంబంధిత తీవ్రమైన వ్యాధులు సరిగ్గా ఇలాంటి చిన్న లక్షణాలతోనే మొదలవుతాయి. లోపల చూపు పూర్తిగా దెబ్బతినే వరకు ఈ వ్యాధులు బయటపడవు.

ఆప్టికల్ షాపులను క్లినిక్‌లుగా భావించడం- కళ్లద్దాల షాపులలో కేవలం అద్దాల పవర్‌ను మాత్రమే పరీక్షించగలరు. కంటి లోపల దాగి ఉండే గ్లాకోమా, డయాబెటిక్ రెటినోపతి లేదా మ్యాక్యులర్ డిసీజ్ వంటి ప్రమాదకరమైన జబ్బులను గుర్తించాలంటే కంటి పాపలను వెడల్పు చేసి చూసే ప్రత్యేక పరికరాలు అవసరం. అవి ఆప్టికల్ షాపుల్లో ఉండవు. కాబట్టి అక్కడ పవర్ నార్మల్​గా ఉందని వస్తే మీ కన్ను పూర్తిగా ఆరోగ్యంగా ఉందని గ్యారెంటీ లేదు. చాలామంది డాక్టర్ ఫీజులు మిగుల్చుకోవడానికి నేరుగా అద్దాల షాపులకే వెళ్లి పరీక్షలు చేయించుకుంటారు. ముఖ్యంగా డయాబెటిస్ (మధుమేహం), బీపీ ఉన్నవారు ఇలా చేయడం వల్ల కంటి చూపును కోల్పోయే ప్రమాదం ఉంది.

మెడికల్ షాపుల్లో దొరికే ఐ డ్రాప్స్ వాడటం- కళ్లు కొద్దిగా ఎర్రబడగానే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాపుల నుంచి ఏవో ఒక ఐ డ్రాప్స్ కొని వాడటం చాలామందికి అలవాటు. ఈ అలవాటు కళ్లను మరింత ప్రమాదంలోకి నెడుతుంది. కంటి ఎరుపుదనాన్ని తగ్గించే కొన్ని డ్రాప్స్ తరచూ వాడటం వల్ల ‘రీబౌండ్ రెడ్‌నెస్’ వచ్చి కళ్లు శాశ్వతంగా ఎర్రగా మారతాయి. ఇక స్టెరాయిడ్ డ్రాప్స్ అయితే కంటి లోపలి ఒత్తిడిని పెంచి నిశ్శబ్దంగా చూపును హరిస్తాయి.

లవాట్లు మార్చుకోకపోవడం- కంటి అలసటకు స్క్రీన్ సమయమే కారణమని అందరికీ తెలుసు. కానీ దానికి తగ్గట్టుగా ఎవరూ అలవాట్లను మార్చుకోరు. మొబైల్ బ్రైట్‌నెస్ పూర్తిగా పెంచేసి చూడటం, చీకట్లో స్క్రీన్లు వాడటం చేస్తుంటారు. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి, 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్ల పాటు చూడాలనే కంటి నియామాన్ని చాలామంది పాటించరు.

ఏళ్ల నాటి పాత కళ్లద్దాలనే వాడటం- కంటి పవర్ మారినప్పటికీ పాత అద్దాలనే వాడటం వల్ల కళ్లపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. దీనివల్ల కంటి కండరాలు నిరంతరం శ్రమించాల్సి వస్తుంది. చాలామంది తలనొప్పితో ఏళ్ల తరబడి బాధపడతారే కానీ, ఒక ఐదు నిమిషాలు కేటాయించి కంటి పరీక్ష చేయించుకోవడానికి బద్ధకిస్తారు. కొత్త అద్దాలు పెట్టుకునే వరకు పాత అద్దాల వల్ల కళ్లు ఎంత ఒత్తిడికి గురవుతున్నాయో ఎవరికీ అర్థం కాదు.

కాంటాక్ట్ లెన్స్‌లు పెట్టుకుని పడుకోవడం- ఎంత అలసటగా ఉన్నా రాత్రి పడుకునే ముందు కాంటాక్ట్ లెన్స్‌లను తొలగించడం మరువకూడదు. కనీసం ఒక్క రాత్రి లెన్స్‌లతో పడుకున్నా కార్నియా ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం విపరీతంగా పెరుగుతుంది. కంటి డాక్టర్ల వద్దకు వచ్చే తీవ్రమైన కంటి ఇన్‌ఫెక్షన్ కేసులలో మెజారిటీ కేసులు కేవలం ఒక్క రాత్రి లెన్స్ తీయకుండా పడుకోవడం వల్ల వచ్చినవే ఉంటాయి.

చూపు బాగుంది కదా అని పరీక్షలు మానెయ్యడం- గ్లాకోమా వంటి వ్యాధులు ప్రారంభంలో ఎలాంటి నొప్పి లేదా లక్షణాలను చూపించవు. చూపు మెల్లగా తగ్గుతున్నా మనకు తెలియదు. ఈరోజు చూపు బాగుంది కదా అని నిర్లక్ష్యం చేస్తే వచ్చే ఏడాదికి అది అలాగే ఉంటుందని చెప్పలేం. అందుకే ఎలాంటి సమస్యలు లేకపోయినా క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలి.

ఎండలోకి వెళ్లేటప్పుడు సన్‌గ్లాసెస్ వాడకపోవడం- సూర్యుడి నుంచి వచ్చే ప్రమాదకరమైన యూవీ కిరణాల ప్రభావం వెంటనే తెలియదు. కానీ ఏటా ఎండలో తిరగడం వల్ల ఆ ప్రభావం కంటిపై పేరుకుపోయి వయసు పెరిగే కొద్దీ శుక్లాలు త్వరగా రావడానికి కారణమవుతుంది. తక్కువ ధరలోనే దొరికే మంచి సన్‌గ్లాసెస్ కంటికి ఎంతో రక్షణ ఇస్తాయి, కానీ ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు చాలామంది మరిచిపోయే వస్తువు ఇదే కావడం విచారకరం.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe