...
...
Next Story

Fake visa scam : వీసా దొరికిందని టికెట్​ తీసుకుని ఎయిర్​పోర్ట్​కి వెళతారు.. కానీ అవి ఫేక్​ అని తెలిస్తే?

మెరుగైన జీవితం కోసం విదేశాలకు వెళ్లాలనుకున్న ఒక సామాన్యుడి కలలు ఇమ్మిగ్రేషన్ మోసగాళ్ల చేతిలో ఛిద్రమయ్యాయి. వీసా, టికెట్ నకిలీవని తెలియడంతో ఆయన కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ఇప్పుడు వైరల్​ అవుతోంది. ఇలా చాలా మంది ఇప్పుడు ‘ఫేక్​ వీసా’ స్కామ్​కి బలవుతున్నారు. అసలేం జరిగింది?

Published on: Mar 10, 2026, 10:45:41 IST
Advertisement
<p>బంగ్లాదేశ్‌లోని మాణిక్‌గంజ్ జిల్లా బలియా భడ గ్రామానికి చెందిన 35 ఏళ్ల మహ్మద్ బాబుల్ హొస్సేన్ (జమాల్) వృత్తిరీత్యా టైలర్. ఒక చిన్న కుట్టు మిషన్ షాపు నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషించేవాడు. భార్యాబిడ్డలకు మెరుగైన భవిష్యత్తును ఇవ్వాలనే ఉద్దేశంతో 2020 నుంచి పైసా పైసా కూడబెట్టి విదేశాలకు వెళ్లాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు.</p>

బంగ్లాదేశ్‌లోని మాణిక్‌గంజ్ జిల్లా బలియా భడ గ్రామానికి చెందిన 35 ఏళ్ల మహ్మద్ బాబుల్ హొస్సేన్ (జమాల్) వృత్తిరీత్యా టైలర్. ఒక చిన్న కుట్టు మిషన్ షాపు నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషించేవాడు. భార్యాబిడ్డలకు మెరుగైన భవిష్యత్తును ఇవ్వాలనే ఉద్దేశంతో 2020 నుంచి పైసా పైసా కూడబెట్టి విదేశాలకు వెళ్లాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

హొస్సేన్ విదేశీ ప్రయత్నాలు మొదటి నుంచీ మోసాల మధ్యే సాగాయి:

2021లో మొదటి మోసం: ఒక వ్యక్తికి సుమారు 2,50,000 టాకాలు (సుమారు రూ. .8 లక్షలు) చెల్లించి మోసపోయాడు.

రెండో ప్రయత్నం: సౌదీ అరేబియా వెళ్లేందుకు మరో వ్యక్తికి 50,000 టాకాలు ఇచ్చాడు, కానీ వీసా రాలేదు.

2024లో మూడో మోసం: బెలారస్ పంపిస్తామన్న ఒక ఏజెన్సీతో 7,50,000 టకాలకు ఒప్పందం చేసుకుని, వాయిదాల పద్ధతిలో 30,000 టకాలు చెల్లించాడు. అది కూడా మోసమేనని తేలింది.

ఇంత జరిగినా విదేశీ ఆశ వదులుకోని హొస్సేన్, ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా "సోహైల్" అనే వ్యక్తి పరిచయమయ్యాడు. థాయ్‌లాండ్‌లోని 'బిడి ఫుడ్' అనే కంపెనీలో నెలకు 50,000 టకాల జీతంతో ఉద్యోగం ఇప్పిస్తానని సోహైల్ నమ్మబలికాడు. ఇందుకోసం సోహైల్ చెప్పిన ఆఫ్రిది అనే వ్యక్తికి అనేక మార్గాల ద్వారా మొత్తం 3,60,000 టకాలు (సుమారు 2.7 లక్షలు) పంపాడు.

ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు విమానం ఎక్కాల్సి ఉండటంతో హొస్సేన్ ఉత్సాహంగా ఢాకా విమానాశ్రయానికి చేరుకున్నాడు. తీరా లోపలికి వెళ్లాక అధికారులు తనిఖీ చేయగా.. అతని వీసా, విమానం టిక్కెట్లు, ఉద్యోగ పత్రాలన్నీ నకిలీవని తేలింది. ఆ ఒక్క మాటతో అతని ప్రపంచం ఒక్కసారిగా చీకటిమయమైంది.

"నేను షాపులోని వస్తువులన్నీ అమ్మేసి, తెలిసిన వారి దగ్గర అప్పులు చేసి ఈ డబ్బు కట్టాను. ఇప్పుడు ఆ అప్పులు ఎలా తీర్చాలో తెలియడం లేదు. నేను విదేశాలకు వెళుతున్నానని ఊరంతా తెలుసు, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఇంటికి వెళ్లాలో అర్థం కావడం లేదు," అంటూ హొస్సేన్ విమానాశ్రయంలో కన్నీరుమున్నీరయ్యాడు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe