...
...
Next Story

iPhone duo : ఐఫోన్ కొందామా.. కారు కొందామా? రూ. 4.5 లక్షల 'ఐఫోన్ డ్యూయో'తో వచ్చే కార్లు ఇవే..

యాపిల్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ 'ఐఫోన్ డ్యూయో' టాప్ మోడల్ ధర రూ. 4.49 లక్షలకు చేరడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఒక్క ఫోన్ కొనే బడ్జెట్‌లోనేభారత్‌లో లభించే ఆల్టో కే10, టాటా టియాగో వంటి పాపులర్ కార్ల వివరాలు ఇక్కడ చూద్దాం.

Published on: Sep 10, 2026, 12:20:39 IST
Advertisement
<p>యాపిల్ సంస్థ మార్కెట్లోకి తెచ్చిన సరికొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ‘ఐఫోన్ డ్యూయో’ ధరలు చూసి సగటు మొబైల్ ప్రియులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఐఫోన్ అనగానే ఖరీదైనదనే భావన సాధారణంగా ఉన్నప్పటికీ, ఈసారి టాప్ వేరియంట్ ధర ఏకంగా రూ. 4.49 లక్షలు తాకడం టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది. అయితే, ఈ ఒక్క ఫోన్ కొనే సొమ్ముతో మనదేశంలో ఒక సరికొత్త కారునే ఇంటికి తెచ్చుకోవచ్చు! భారత్‌లోని మిడిల్ క్లాస్ వర్గాలకు ఎంతో ఇష్టమైన పలు హ్యాచ్‌బ్యాక్ కార్ల షోరూమ్ ప్రారంభ ధరలు ఈ ఐఫోన్ 2టీబీ వేరియంట్ కంటే తక్కువగా ఉండటం విశేషం.</p>

యాపిల్ సంస్థ మార్కెట్లోకి తెచ్చిన సరికొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ‘ఐఫోన్ డ్యూయో’ ధరలు చూసి సగటు మొబైల్ ప్రియులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఐఫోన్ అనగానే ఖరీదైనదనే భావన సాధారణంగా ఉన్నప్పటికీ, ఈసారి టాప్ వేరియంట్ ధర ఏకంగా రూ. 4.49 లక్షలు తాకడం టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది. అయితే, ఈ ఒక్క ఫోన్ కొనే సొమ్ముతో మనదేశంలో ఒక సరికొత్త కారునే ఇంటికి తెచ్చుకోవచ్చు! భారత్‌లోని మిడిల్ క్లాస్ వర్గాలకు ఎంతో ఇష్టమైన పలు హ్యాచ్‌బ్యాక్ కార్ల షోరూమ్ ప్రారంభ ధరలు ఈ ఐఫోన్ 2టీబీ వేరియంట్ కంటే తక్కువగా ఉండటం విశేషం.

యాపిల్ తొలిసారి ప్రవేశపెట్టిన ఈ ఫోల్డబుల్ ఫోన్ 7.6-అంగుళాల ఇన్నర్ డిస్‌ప్లే, టైటానియం ఫ్రేమ్, అత్యంత వేగవంతమైన A20 ప్రో చిప్‌సెట్‌తో అందుబాటులోకి వచ్చింది. విభిన్న స్టోరేజ్ వేరియంట్ల ఆధారంగా కంపెనీ నిర్ణయించిన ధరల పట్టిక ఇది: 256GB వేరియంట్: రూ. 2,99,900, 512GB వేరియంట్: రూ. 3,24,900, 1TB వేరియంట్: రూ. 3,74,900, 2TB వేరియంట్: రూ. 4,49,900.

మారుతీ సుజుకీ ఆల్టో కే10 : దీని ఎక్స్​షోరూం ధర రూ. 3.69లక్షల నుంచి రూ. 5.44లక్షల వరకు ఉంటుంది. నగరాల్లో ప్రయాణానికి అత్యంత సౌకర్యవంతమైన ఈ ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ 1.0-లీటర్ కే-సిరీస్ ఇంజిన్‌తో వస్తుంది. మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో పాటు మైలేజ్ ప్రియుల కోసం కంపెనీ ఫిట్టెడ్ సీఎన్‌జీ మోడల్‌లోనూ లభిస్తుంది.

మారుతీ సుజుకీ ఎస్​-ప్రెస్సో : దీని ఎక్స్​షోరూం ధర రూ. 3.49లక్షల నుంచి రూ. 5.27లక్షల వరకు ఉంటుంది. మైక్రో ఎస్‌యూవీ తరహా డిజైన్‌తో వచ్చే ఈ చిన్న కారు 1.0-లీటర్ కే10సీ పెట్రోల్ ఇంజిన్‌తో నడుస్తుంది. ఐడ్లింగ్ స్టార్ట్-స్టాప్ టెక్నాలజీ వల్ల నగరాల్లో అద్భుతమైన మైలేజ్ అందిస్తుంది. ఐఫోన్ టాప్ మోడల్ కంటే దీని ప్రారంభ వేరియంట్ ధర రూ. 1 లక్ష వరకు తక్కువ కావడం గమనార్హం.

రెనాల్ట్ క్విడ్ : దీని ఎక్స్​షోరూం ధర రూ. 4.53లక్షల నుంచి రూ. 5.60లక్షల వరకు ఉంటుంది. ఐఫోన్ డ్యుయో కన్నా రూ. 4వేలు మాత్రమే ఎక్కువ! డీలర్ల ఆఫర్లు, ఆన్‌లైన్ డిస్కౌంట్లతో ఈ కారు మరికొంత తక్కువ ధరకే లభిస్తుంది. 8-అంగుళాల టచ్‌స్క్రీన్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ఏబీఎస్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ స్టార్ట్ అసిస్ట్ వంటి అనేక సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

మారుతీ సుజుకీ సెలేరియో : దీని ఎక్స్​షోరూం ధర రూ. 4.69లక్షల నుంచి రూ. 6.75లక్షల వరకు ఉంటుంది. ఐఫోన్ డ్యుయో కన్నా దీని ధర కేవలం రూ. 20వేలు ఎక్కువ! మైలేజ్ విషయంలో మంచి పేరు సాధించిన ఈ కారు 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో నడుస్తుంది. ట్రాఫిక్‌లో సులువుగా తోలేందుకు ఆటోమేటిక్ ఆప్షన్‌తో పాటు సీఎన్జీ వేరియంట్‌లోనూ దొరుకుతుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks