...
...
Next Story

Vinayaka Chavithi : లంబోదరుడి ఆగమనం.. ఊరూ వాడా ‘గణపతి బప్పా’! స్పెషల్ ఫొటోలు..

దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు అంబరాన్ని తాకుతున్నాయి. వివిధ నగరాల్లో గణపతి విగ్రహాలు సందడి చేస్తున్నాయి. భారీ సంఖ్యలో ప్రజలు ఆలయాలకు తరలివెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో నెలకొన్న పండుగ వాతావరణాన్ని ఫొటోల రూపంలో ఇక్కడ చూసేయండి..

Published on: Sep 14, 2026, 11:20:47 IST
Advertisement
<p>గణేశ్ ఉత్సవాలు అంటే ముందుగా గుర్తొచ్చేది మహారాష్ట్ర! ముంబైలోని అంధేరీ ప్రాంతంలో వినాయక విగ్రహాన్ని ఇలా ఊరేగింపుగా తీసుకెళ్లారు.</p>

గణేశ్ ఉత్సవాలు అంటే ముందుగా గుర్తొచ్చేది మహారాష్ట్ర! ముంబైలోని అంధేరీ ప్రాంతంలో వినాయక విగ్రహాన్ని ఇలా ఊరేగింపుగా తీసుకెళ్లారు.

బిహార్ రాజధాని పట్నాలో గణపతి ప్రతిమల వద్ద ఓ మహిళా కస్టమర్.

వినాయక చవితి నేపథ్యంలో అసోం గువాహటీలోని లటసిల్ గణేశ్ ఆలయంలో సోమవారం భక్తులు ఇలా దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు.

వినాయక చవితి వేళ ముంబైలోని ప్రపంచ ప్రఖ్యాత లాల్​బాగ్​చా రాజాకు ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు.

దిల్లీ ఝందేవలాన్ ప్రాంతంలో వినాయకుడి విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతున్న ఒక ఆర్టిస్ట్​.

దిల్లీలోని ఝందేవాలన్ మార్కెట్​లో వినాయకుడి ప్రతిమలను కొనుగోలు చేస్తున్న ప్రజలు. దిల్లీలో సైతం ఈసారి గణేశ్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

నోయిడాలో పరిస్థితి ఇది! ప్రజలు భారీ సంఖ్యలో వినాయకుడి విగ్రహాలను కొనుగోలు చేస్తున్నప్పుడు తీసిన ఫొటో.

గురుగ్రామ్​లో గణపతిని మండపం వద్దకు తీసుకెళుతున్నప్పుడు కెమెరాకు చిక్కిన దృశ్యం.

నోయిడాలో గణపతి ప్రతిమతో ఓ మహిళ

హైదరాబాద్​ ఖైరతాబాద్​లోని 69 అడుగుల వినాయకుడి విగ్రహం. ఇది సెప్టెంబర్​ 12న తీసిన ఫొటో..

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks