
మహిళల జట్టుకు 211 మ్యాచుల్లో ప్రాతినిథ్యం వహించారు హర్మన్‌ప్రీత్ కౌర్. ఆమె కెప్టెన్సీ చేసిన 51 మ్యాచుల్లో టీమిండియా 30సార్లు గెలిచింది. ఏ మహిళా కెప్టెన్‌కైనా ఇదే హయ్యెస్ట్! 2025లో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా విన్నింగ్ కెప్టెన్‌గా చరిత్రలో నిలిచిపోయారు హర్మన్.
ఇక 155 టీ20ల్లో కెప్టెన్సీ చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్.. ఇండియాను 30సార్లు గెలిపించారు. ఇది కూడా అత్యధికమే! అంతేకాదు టీమిండియా టెస్టు టీమ్‌కి ఐదుసార్లు కెప్టెన్‌గా పనిచేశారు. ఒక్కటంటే ఒక్కటే మ్యాచ్‌లో జట్టు ఓడిపోయింది.
ఇప్పటివరకు 8 టెస్టులు, 164 వన్డేలు, 210 టీ20లు ఆడారు హర్మన్‌ప్రీత్. వన్డేల్లో 4541, టీ20ల్లో 188 రన్స్ చేశారు. బౌలర్‌గా వన్డేల్లో 31, టీ20ల్లో 32 వికెట్లు తీశారు.
కెప్టెన్స్ నుంచి తప్పుకోవాలన్న నిర్ణయం తీసుకోవడం తనకు ఎంతమాత్రం సులువు కాలేదని, దీని వెనుక ఎన్నో ఏళ్ల జ్ఞాపకాలు, త్యాగాలు, భావోద్వేగాలు దాగున్నాయని హర్మన్‌ప్రీత్ కౌర్ పేర్కొన్నారు. భారత క్రికెట్ కోసం తన రక్తాన్ని, చెమటను, సమయాన్ని ధారపోశానని, జట్టు ప్రయోజనాల కోసం చాలాసార్లు తన వ్యక్తిగత ఆటను, ఆశయాలను కూడా పక్కన పెట్టానని ఆమె చెప్పుకొచ్చారు.
2012లో ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో టీ20 మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ తొలిసారి సారథ్యం బాధ్యతలు చేపట్టారు. 2016లో ఫుల్ టైమ్ కెప్టెన్‌గా మారారు. మిథాలి రాజ్ రిటైర్మెంట్ అనంతరం 2022లో వన్డే కెప్టెన్సీ బాధ్యతలు సైతం స్వీకరించారు. హర్మన్‌ప్రీత్ కౌర్ తప్పుకోవడంతో ఇప్పుడు మహిళల టీమ్‌కు ఎవరు కెప్టెన్ అవుతారన్న అంశం హాట్‌టాపిక్‌గా మారింది.