
ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సి మరోసారి తన సత్తాచాటాడు. తన మ్యాజికల్ గేమ్ తో ప్రపంచాన్ని ఉర్రూతలూగించాడు. ఫిఫా ప్రపంచకప్ లో అద్భుతం చేశాడు.
ఫిఫా ప్రపంచకప్ 2026లో అర్జెంటీనా ఫస్ట్ మ్యాచ్ లోనే మెస్సి హ్యాట్రిక్ తో సత్తాచాటాడు. అల్జీరియాతో పోరులో ఏకంగా మూడు గోల్స్ చేశాడు.
ఇండియన్ టైమ్ ప్రకారం ఇవాళ (జూన్ 17) ఉదయం జరిగిన మ్యాచ్ లో అర్జెంటీనా 3-0 తేడాతో అల్జీరియాపై గెలిచింది. మెస్సి 17వ, 60వ, 76వ నిమిషాల్లో గోల్స్ కొట్టాడు.
తన డ్రిబ్లింగ్ స్కిల్స్ తో మెస్సి మరోసారి మాయ చేశాడు. అతను గోల్స్ కొడుతుంటే స్డేడియమే కాదు ప్రపంచమే ఊగిపోయింది. తన అద్భుతమైన ఆటతీరుతో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాకు గ్రేట్ స్టార్ట్ అందించాడు మెస్సి.
ఈ హ్యాట్రిక్ గోల్స్ తో మెస్సి ఓ కొత్త రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా టాప్ లో ఉన్న మిరోస్లావ్ (జర్మనీ) సరసన చేరాడు. మిరోస్లావ్, మెస్సి చెరో 6 గోల్స్ కొట్టారు.