...
...
Next Story

In Pics : ఓరి దేవుడా ఎంతటి దారుణం.. చేవెళ్ల బస్సు ప్రమాదంలో కంకర కింద మృతదేహాలు!

చేవెళ్ల మండలం మీర్జాగూడ బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. ఉదయం 4:45 గంటలకు వికారాబాద్‌లోని తాండూర్ డిపో నుంచి ఆర్టీసీ బస్సు బయల్దేరింది. హైదరాబాద్‌కు వస్తుండగా చేవెళ్ల మండ‌లంలోని మీర్జాగూడ వద్ద బస్సును కంకరతో వస్తున్న టిప్పర్ ఢీ కొట్టింది.

Published on: Nov 3, 2025, 11:10:08 IST
Advertisement
<p>చేవెళ్ల మండలం మీర్జాగూడ బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. ఉదయం 4:45 గంటలకు వికారాబాద్‌లోని తాండూర్ డిపో నుంచి ఆర్టీసీ బస్సు బయల్దేరింది. హైదరాబాద్‌కు వస్తుండగా చేవెళ్ల మండ‌లంలోని మీర్జాగూడ వద్ద బస్సును కంకరతో వస్తున్న టిప్పర్ ఢీ కొట్టింది.</p>

చేవెళ్ల మండలం మీర్జాగూడ బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందారు. ఉదయం 4:45 గంటలకు వికారాబాద్‌లోని తాండూర్ డిపో నుంచి ఆర్టీసీ బస్సు బయల్దేరింది. హైదరాబాద్‌కు వస్తుండగా చేవెళ్ల మండ‌లంలోని మీర్జాగూడ వద్ద బస్సును కంకరతో వస్తున్న టిప్పర్ ఢీ కొట్టింది.

కంకర లోడ్‌తో వస్తూ అతివేగంతో వచ్చి బస్సుని టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 20 మందికిపైగా ప్రయాణికులు మృతి చెందారు. వారి శరీరాలు కంకరలో కూరుకుపోయాయి.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నారు. పటాన్‌చెరు లక్డారం క్రషర్‌ నుంచి వికారాబాద్‌ వైపు వెళ్తోంది లారీ. రహదారిపై గుంతను తప్పించబోయి మీర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సును కంకర లారీ కొట్టింది. ఎదురుగా వచ్చి పూర్తిగా ఆర్టీసీ బస్సుపైకి ఒరిగింది.

బస్సులోని ప్రయాణికులపై లారీలో ఉన్న కంకర పడింది. దీంతో కంకర కింద ప్రయాణికులు కూరుకుపోయారు. మూడు జేసీబీల సహాయంతో సహాయ చర్యలు చేపట్టారు. మృతదేహాలను బయటకు తీస్తుంటే హృదాయ విదారక దృశ్యాలు కనిపించాయి.

బస్సుపై కంకరలోడు ఒక్కసారిగా పడిపోవడంతో ప్రమాద తీవ్రత ఎక్కువైంది. అందులో ఉన్న ప్రయాణికులు కంకరలో కూరుకుపోయారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి వచ్చి సహాయక చర్యలు చేపట్టారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe