...
...
Next Story

తెలంగాణ వెదర్ రిపోర్ట్ : పెరుగుతున్న చలి తీవ్రత - అక్టోబర్ 28 నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు!

Telangana Weather Updates : తెలంగాణకు వాతావరణశాఖ ముఖ్యమైన హెచ్చరికలను జారీ చేసింది. అక్టోబర్ 28 నుంచి 30 వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గంటకు 50-60 కిమీ వేగంతో ఈదురుగాలులు, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత పెరిగింది.

Published on: Oct 25, 2026, 09:47:21 IST
Advertisement
<p>తెలంగాణలో వాతావరణం వేగంగా మారుతోంది. ఎల్‌నినో ప్రభావంతో ఇన్నాళ్లూ రాత్రిపూట సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, శుక్రవారం నుంచి కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దీనికి తోడు పలు జిల్లాల్లో చలిగాలులు కూడా వీస్తున్నాయి. శనివారం నాటికి రాష్ట్రంలోనే అత్యంత తక్కువగా ఆదిలాబాద్‌లో 16.7 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.</p>

తెలంగాణలో వాతావరణం వేగంగా మారుతోంది. ఎల్‌నినో ప్రభావంతో ఇన్నాళ్లూ రాత్రిపూట సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, శుక్రవారం నుంచి కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. దీనికి తోడు పలు జిల్లాల్లో చలిగాలులు కూడా వీస్తున్నాయి. శనివారం నాటికి రాష్ట్రంలోనే అత్యంత తక్కువగా ఆదిలాబాద్‌లో 16.7 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.

ఓవైపు చలి పుంజుకుంటున్న తరుణంలోనే… వాతావరణ శాఖ కీలక హెచ్చరికలను జారీ చేసింది. రాబోయే రెండు మూడు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

అక్టోబర్ 25, 26 తేదీల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉనప్పటికీ, అక్టోబర్ 26 ఉదయం నుంచి పలు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. అక్టోబర్ 28 ఉదయం 8:30 గంటల నుంచి అక్టోబర్ 29 ఉదయం 8:30 గంటల వరకు (రోజూ 5) రాష్ట్రంలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్/ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది.

ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

అంతేకాకుండా జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జనగాం, నల్గొండ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదు కావచ్చు.

ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే సూచనలున్నయి.

అక్టోబర్ 29 నుంచి 30 వరకు మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ సమయంలో గంటకు 30-40 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

అక్టోబర్ 30 తర్వాత వర్ష తీవ్రత తగ్గి తేలికపాటి జల్లులు మాత్రమే కురుసే సూచనలున్నాయి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks