తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్ - వరుసగా 2 రోజులు సెలవులు..!
తెలంగాణలోని విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. వరసుగా రెండు రోజులు సెలవులు రానున్నాయి. ఎందుకంటే ఈనెల 21వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం బోనాల సెలవును ప్రకటించింది. దీనికితోడు ముందురోజు ఆదివారం వచ్చింది. దీంతో వరసుగా 2 రోజులు హాలీ డేస్ రానున్నాయి.
తెలంగాణ ఏర్పాటు తర్వాత బోనాల పండగను ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది కూడా తెలంగాణలో ఘనంగా బోనాల ఉత్సవాలు జరుగుతున్నాయి. దీంతో ప్రతి ఏటా బోనాల సందర్భంగా రాష్ట్రంలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నారు. అలానే ఈ ఏడాది జులై 21 సోమవారం నాడు బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి.
తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 2025 సెలవుల జాబితాలో బోనాలను హాల్ డేగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లిస్ట్‌లో బోనాలను ఆప్షనల్ హాలీడే కాకుండా సాధారణ సెలవుగా ప్రకటించారు. అంటే రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు తప్పనిసరిగా మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు ఏపీలో మాత్రం జూలై 21న ఎలాంటి సెలవు లేదు. అక్కడి యాధావిథిగా పాఠశాలలు పని చేస్తాయి. కేవలం తెలంగాణలో మాత్రమే ఈ సెలవు ఉంది.
తెలంగాణలోని విద్యార్థులకు ఎగిరి గంతెసే వార్త వచ్చేసింది. వరసుగా రెండు రోజులు సెలవులు రానున్నాయి. జూలై 21వ తేదీన బోనాల సెలవును ప్రభుత్వం ప్రకటించింది. పైగా రేపు సండే కూడా ఉండటంతో స్కూల్ మూతపడనున్నాయి.
జులై 19 అంటే ఇవాళ (శనివారం) చాలా స్కూళ్లకు హాఫ్ డేనే ఉంది. దీంతో ఇవాళ మద్యాహ్నం నుంచే సెలవులు వచ్చినట్లు అయింది. తిరిగి జూలై 22వ తేదీన పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి.
తెలంగాణ సర్కార్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. 2025 ఏడాదిలో మొత్తం 27 సాధారణ సెలవులు, 23 ఐచ్చిక సెలవులు ఉన్న సంగతి తెలిసిందే. వీటిలో ఇప్పటికే కొన్ని పూర్తయ్యాయి.
E-Paper

