కొత్త రేషన్ కార్డుల పంపిణీ అప్డేట్ - లిస్ట్ లో మీ పేర్లు లేకపోతే ఇలా చేయండి
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జూలై 14వ తేదీ నుంచి లబ్ధిదారులకు కార్డులను పంపిణీ చేస్తున్నారు. అయితే కార్డు రానివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌరసరఫరాల శాఖ తెలిపింది. అర్హులు ఎప్పుడైనా మీసేవా ద్వారా దరఖాాస్తు చేసుకోవచ్చని పేర్కొంది.
కొత్త రేషన్ కార్డుల పంపిణీలో భాగంగా… జూన్ నాటికి అఫ్రూవ్ వచ్చిన వాటికి పంపిణీ పత్రాలను అందజేస్తున్నారు. అయితే కొత్తగా వచ్చే దరఖాస్తులను కూడా స్వీకరిస్తున్నారు. వీరికి త్వరలోనే కార్డులను పంపిణీ చేస్తారు. కాబట్టి రేషన్ కార్డు రానివాళ్లు… మీసేవా ఆన్ లైన్ కేంద్రాల వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు,
కొత్త రేషన్ కార్డుల కోసం మీసేవా కేంద్రాల వద్దకు వెళ్లే వారు… అక్కడ అందుబాటులో ఉండే మీసేవా దరఖాస్తు ఫామ్ ను నింపాల్సి ఉంటుంది. అంతేకాకుండా దరఖాస్తుదారుడి ఆధార్ కార్డుతో పాటు నివాసపత్రాల(అడ్రస్ ఫ్రూప్ )ను సమర్పించాల్సి ఉంటుంది.
దరఖాస్తుదారుడి పత్రాలను పీడీఎఫ్ రూపంలో ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ పత్రాలు లేకుండా కొత్త రేషన్ కార్డుతో పాటు పాత కార్డుల్లో మార్పులు చేసుకోవడానికి వీలు ఉండదు. సరైన పత్రాలు సమర్పించకుంటే… తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తి వివరాలను సమర్పించాలి.
అయితే రాష్ట్రంలో రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ నిరంతరంగా ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి అర్హులైన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని సూచిస్తున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 89 లక్షల రేషన్ కార్డులు ఉండగా.. అదనంగా 95 లక్షల కొత్త కార్డులు ఇవ్వబోతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. దీంతో పాత, కొత్త కార్డులతో కలిపి మొత్తం లబ్ధిదారుల సంఖ్య 3 కోట్ల 10 లక్షలకు చేరుతుందని అంచనా వేస్తోంది.
పాత కార్డుల్లో కుటుంబ సభ్యుల చేర్చుకునేందుకు కూడా మీసేవా అప్లికేషన్ ఫామ్ నింపాలి. అంతేకాకుండా చేర్చాల్సిన వారి ఆధార్ కార్డులు, ఇంటి చిరునామా పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. మీ దరఖాస్తు ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత… అధికారుల లాగిన్ కు చేరుతుంది. వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి… మీరు అర్హులైతే మీకు కార్డు మంజూరు చేస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా జూలై 13 వరకు వచ్చిన దరఖాస్తులన్నింటిని పరిశీలించి అప్రూవ్ చేయనున్నారు. సుమారు 5 లక్షల మందికి కొత్త కార్డులు ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా నిన్నటి నుంచి కొత్త కార్డుల పంపిణీని ప్రారంభించారు.
కొత్త రేషన్ కార్డుల పంపిణీకి తెలంగాణ సర్కార్ శ్రీకారం చుట్టింది. జూలై 14వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త కార్డుల పంపిణీ జరుగుతోంది. 3 లక్షలకుపైగా కార్డులను పంపిణీ చేస్తోంది.
E-Paper

