...
...
Next Story

Telangana Rains : తెలంగాణలో ఇవాళ, రేపు అత్యంత భారీ వర్షాలు - పలు జిల్లాలకు రెడ్ అలర్ట్, హైదరాబాద్‌లో ఇలా...

Telangana Rains : తెలంగాణలో ఐదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో ఉత్తర, తూర్పు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించగా…. హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు యెల్లో, ఆరెంజ్ అలర్టులు జారీ అయ్యాయి.

Published on: Sep 23, 2026, 09:59:57 IST
Advertisement
<p>తీవ్రవాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా రాబోయే ఐదు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ హెచ్చరికలు జారీ కాగా, గంటకు 30 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. </p>

తీవ్రవాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా రాబోయే ఐదు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ హెచ్చరికలు జారీ కాగా, గంటకు 30 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.

ముఖ్యంగా సెప్టెంబర్ 23, 24(ఇవాళ, రేపు) తేదీలలో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఇవాళ పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అత్యంత జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

సెప్టెంబర్ 24న కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు.

మరోవైపు హైదరాబాద్ మరియు దాని పరిసర ప్రాంతాలైన మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కూడా సెప్టెంబర్ 23 నుంచి 26 వరకు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలతో పాటు అక్కడక్కడ ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నాయి. మంగళవారం ఖైరతాబాద్‌లో 3.2 సెం.మీ., కూకట్‌పల్లి 2.8, ముషీరాబాద్‌ 2.5, అబ్దుల్లాపూర్‌మెట్‌ 2.3 సెం.మీ. వర్షం కురిసింది.

హైదరాబాద్ నగరంలో మంగళవారం పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇవాళ కూడా వర్ష సూచన ఉండటంతో…. లోతట్టు ప్రాంతాల ప్రజలు, వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని, విద్యుత్ స్తంభాలు, పాత భవనాల వద్ద నిలబడవద్దని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

ఇక సెప్టెంబర్ 25న ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ మరియు ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు కావచ్చని అధికారులు హెచ్చరించారు. సెప్టెంబర్ 26 మరియు 27 తేదీలలో ఎలాంటి తీవ్రమైన హెచ్చరికలు లేనప్పటికీ, మోస్తరు జల్లులు పడతాయని పేర్కొన్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks