...
...
Next Story

Ind vs Nz T20: అద్భుతం చేసిన తెలుగు కుర్రాళ్లు.. ఇండియాకు థ్రిల్లింగ్ విక్టరీ అందించిన తిలక్, నితీష్.. కివీస్ పై గెలుపు!

Ind vs Nz T20: వారెవా.. ఇది కదా పోరాటం అంటే! ఇది కదా థ్రిల్లింగ్ విక్టరీ అంటే! మన తెలుగు కుర్రాళ్లు తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి అద్భుతం చేసిన వేళ న్యూజిలాండ్ పై ఇండియా థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. వరుసగా రెండో టీ20లోనూ కివీస్ ను ఓడించింది.

Published on: Oct 24, 2026, 16:30:35 IST
Advertisement
<p>తెలుగు కుర్రాళ్లు తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి అద్భుతం చేశారు. న్యూజిలాండ్ తో రెండో టీ20లో అమేజింగ్ ఫైటింగ్ స్పిరిట్ తో ఇండియాను గెలిపించారు. </p>

తెలుగు కుర్రాళ్లు తిలక్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి అద్భుతం చేశారు. న్యూజిలాండ్ తో రెండో టీ20లో అమేజింగ్ ఫైటింగ్ స్పిరిట్ తో ఇండియాను గెలిపించారు.

181 రన్స్ ఛేజింగ్ లో ఇండియా 14.5 ఓవర్లలో 112 రన్స్ కే ఆరు వికెట్లు కోల్పోయింది. ఆ దశలో తిలక్ వర్మ, నితీష్ కుమార్ నిలబడి జట్టును గెలిపించారు. తిలక్ వర్మ 26 బాల్స్ లోనే అజేయంగా 51 రన్స్ కొట్టాడు. ఇందులో 6 ఫోర్లు, ఓ సిక్సర్ ఉన్నాయి.

వైజాగ్ కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి కూడా బ్యాటింగ్ చెలరేగిపోయాడు. 23 బాల్స్ లోనే 26 రన్స్ సాధించాడు. ఓ ఫోర్, సిక్సర్ కొట్టాడు. తిలక్, నితీష్ కలిసి ఏడో వికెట్ కు 30 బాల్స్ లోనే 69 రన్స్ అన్ బీటెన్ పార్ట్ నర్ షిప్ నెలకొల్పారు.

ఇండియా గెలవాలంటే లాస్ట్ 3 ఓవర్లలో 46 రన్స్ చేయాల్సిన పరిస్థితుల్లో తిలక్, నితీష్ గొప్పగా ఆడారు. సిక్సర్లు, ఫోర్లు బాదారు. ముఖ్యంగా స్మిత్ వేసిన 19వ ఓవర్లో తిలక్ వర్మ మూడు ఫోర్లు, ఓ సిక్సర్ దంచాడు. చివరకు మరో బాల్ ఉండగా ఇండియా గెలిచింది.

వరుసగా రెండు టీ20లు గెలిచిన ఇండియా.. 5 టీ20ల సిరీస్ లో కివీస్ పై 2-0తో ఆధిక్యం సాధించింది. మూడో టీ20 మంగళవారం (అక్టోబర్ 27) జరుగుతుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks