...
...
Next Story

IND vs AFG: కూనను కుమ్మేశారు.. శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ సెంచరీల మోత.. అఫ్గాన్ తో టెస్టు.. ఫస్ట్ డే ఇండియాదే

IND vs AFG: పసికూన అఫ్గానిస్థాన్ తో టెస్టును ఇండియా గ్రాండ్ గా మొదలెట్టింది. ఫస్ట్ డే శుభ్‌మన్ గిల్ (103*), కేఎల్ రాహుల్ సెంచరీల మోత మోగించారు. దీంతో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన భారత్ భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది.

Published on: Jun 6, 2026, 18:59:37 IST
Advertisement
<p>చాలా కాలం తర్వాత ఆడుతున్న టెస్టు మ్యాచ్ లో ఇండియా అదరగొడుతోంది. శనివారం (జూన్ 6) అఫ్గానిస్థాన్ తో ప్రారంభమైన మ్యాచ్ లో ఫస్ట్ రోజు ఆధిపత్యం ప్రదర్శించింది. శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ సెంచరీలతో అదరగొట్టారు. దీంతో ఇండియా 368/3తో డే 1ను ముగించింది. </p>

చాలా కాలం తర్వాత ఆడుతున్న టెస్టు మ్యాచ్ లో ఇండియా అదరగొడుతోంది. శనివారం (జూన్ 6) అఫ్గానిస్థాన్ తో ప్రారంభమైన మ్యాచ్ లో ఫస్ట్ రోజు ఆధిపత్యం ప్రదర్శించింది. శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ సెంచరీలతో అదరగొట్టారు. దీంతో ఇండియా 368/3తో డే 1ను ముగించింది.

ఫస్ట్ రోజు ఆట ముగిసే సమయానికి శుభ్ మన్ గిల్ 103 రన్స్ తో, రిషబ్ పంత్ 50 రన్స్ తో నాటౌట్ గా నిలిచారు.

యశస్వి జైస్వాల్ తో కలిసి కేఎల్ రాహుల్ ఓపెనర్ గా బరిలో దిగాడు. అతను 165 బంతుల్లో 100 పరుగులు చేశాడు. టెస్టుల్లో కేఎల్ కు ఇది 12వ సెంచరీ.

మూడో ప్లేస్ లో బ్యాటింగ్ కు వచ్చిన సాయి సుదర్శన్ కూడా 81 పరుగులతో మంచి ప్రదర్శన ఇచ్చాడు, రాహుల్‌తో కలిసి రెండవ వికెట్ కోసం 139 పరుగులు జోడించాడు.

మహమ్మద్ సలీమ్‌ బౌలింగ్ లో ఒక సింగిల్‌తో శుభ్ మన్ తన 11వ టెస్టు శతకాన్ని సాధించాడు.

అఫ్గానిస్థాన్ తరపున మహమ్మద్ సలీమ్ డే 1లో ఉత్తమ ప్రదర్శన ఇచ్చాడు, అతను రెండు వికెట్లు సాధించాడు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe