...
...
Next Story

Team India Records: వెల్లింగ్ట‌న్‌లో రికార్డుల మోత‌.. కివీస్‌తో టెస్టులో ఇండియా బ్యాట‌ర్ల విధ్వంసం.. పంత్ సిక్సర్ల జోరు!

Team India Records: ఇండియన్ టీమ్ బ్యాటర్ల మామూలు విధ్వంసం కాదు ఇది. న్యూజిలాండ్ లో కివీస్ తో టెస్టులో భారత బ్యాటర్లు చెలరేగిపోయారు. బ్యాటింగ్ లో రికార్డుల మోత మోగించారు. అత్యధిక స్కోరు నుంచి పంత్ సెంచరీ వరకూ.. టీమిండియా రికార్డులపై ఓ లుక్కేయండి.

Published on: Nov 22, 2026, 20:01:12 IST
Advertisement
<p>వెల్లింగ్టన్ టెస్టులో రిషబ్ పంత్ సెంచరీ (153 బాల్స్ లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 128)తో చెలరేగాడు. దీంతో సేనా (సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో టెస్టు సెంచరీలు చేసిన ఫస్ట్ ఆసియా వికెట్ కీపర్ బ్యాటర్ గా పంత్ రికార్డు క్రియేట్ చేశాడు. </p>

వెల్లింగ్టన్ టెస్టులో రిషబ్ పంత్ సెంచరీ (153 బాల్స్ లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో 128)తో చెలరేగాడు. దీంతో సేనా (సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో టెస్టు సెంచరీలు చేసిన ఫస్ట్ ఆసియా వికెట్ కీపర్ బ్యాటర్ గా పంత్ రికార్డు క్రియేట్ చేశాడు.

టెస్టులో రిషబ్ పంత్ కు ఇది 9వ సెంచరీ. ప్రపంచ క్రికెట్లోనే అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన వికెట్ కీపర్ బ్యాటర్లలో ఆడం గిల్ క్రిస్ట్ (17), ఆండీ ఫ్లవర్ (12) తర్వాతి ప్లేస్ లో పంత్ ఉన్నాడు.

టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్లలో రిషబ్ పంత్ సెకండ్ ప్లేస్ కు చేరుకున్నాడు. 108 సిక్సర్లు కొట్టిన పంత్.. మెక్ కలమ్ (107) రికార్డు బ్రేక్ చేశాడు. కేవలం బెన్ స్టోక్స్ (138) మాత్రమే పంత్ కంటే ముందున్నాడు.

ఇండియా ఇన్నింగ్స్ లో మరో సెంచరీ హీరో కేఎల్ రాహుల్ కూడా రికార్డులు బ్రేక్ చేశాడు. సేనా దేశాల్లో టెస్టు సెంచరీలు చేసిన ఫస్ట్ ఇండియన్ ఓపెనర్ గా కేఎల్ రాహుల్ నిలిచాడు.

న్యూజిలాండ్ తో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇండియా 720/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. న్యూజిలాండ్ లో టెస్టు ఇన్నింగ్స్ లో ఓ టీమ్ చేసిన అత్యధిక స్కోరు ఇదే. విదేశాల్లో ఇండియాకు ఇదే హైయ్యస్ట్ స్కోరు. అంతే కాకుండా కివీస్ పై ఏ టీమ్ కైనా ఇదే అత్యధిక స్కోరు.

 

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks