
సాధారణంగా ఇన్‌స్టాగ్రామ్‌లో మనం ఫోటోలను అందంగా ఎడిట్ చేసి, ఫిల్టర్లు అద్ది పెడుతుంటాం. కానీ 'ఇన్‌స్టంట్స్' అందుకు భిన్నం. ఇది పూర్తిగా సహజమైన కంటెంట్‌ను షేర్ చేయడంపై దృష్టి పెడుతుంది.
ఈ యాప్ ద్వారా తీసిన ఫోటోలను ఎడిట్ చేయడం కుదరదు. ఫిల్టర్లు వాడటానికి వీలుండదు. కేవలం బేసిక్ టెక్స్ట్ మాత్రమే రాసుకోవచ్చు. మీ ఫోన్ గ్యాలరీలో ముందే ఉన్న ఫోటోలను ఇందులో షేర్ చేయలేరు. అప్పటికప్పుడు ఇన్-యాప్ కెమెరాతో ఫోటో తీసి మాత్రమే పంపాలి!
మీరు పంపిన ఫోటోలను అవతలి వారు ఒక్కసారి మాత్రమే చూడగలరు. ఆ తర్వాత 24 గంటల లోపు అవి ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతాయి. మీకు ఫాలో అయ్యే వారు, మీరు తిరిగి ఫాలో చేసే వారికి మాత్రమే ఫోటోలు పంపే వీలుంటుంది.
సోషల్ మీడియాలో 'పర్ఫెక్ట్' ఫోటోల కోసం యూజర్లు పడే ఒత్తిడిని తగ్గించడమే ఈ యాప్ ఉద్దేశమని ఇన్‌స్టాగ్రామ్ ప్రతినిధి తెలిపారు. "యూజర్లు తమ స్నేహితులతో ఎటువంటి హంగులు లేని క్యాజువల్ ఫోటోలను పంచుకోవడానికి ఇదొక సులభమైన వేదిక," అని నివేదికలు సూచిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లలో కనిపిస్తున్నప్పటికీ, భారత్ వంటి మార్కెట్లలో డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఇంకా అందుబాటులోకి రాలేదు. స్మాప్చాట్కి గట్టి పోటీ ఇచ్చే విధంగా రూపొందించిన ఈ యాప్.. త్వరలోనే మెయిన్ ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లో ఒక ఫీచర్‌గా కూడా వచ్చే అవకాశం ఉంది.