...
...
Next Story

iPhone 17e vs iPhone 16 : రూ. 60వేల ధరలోపు రెండు ఐఫోన్స్​- ఏది కొనాలి?

యాపిల్ ఇటీవలే విడుదల చేసిన ఐఫోన్ 17ఈ ఇప్పుడు భారత్‌లో అందుబాటులోకి వచ్చింది. బ్యాంక్ ఆఫర్లతో దీని ధర రూ. 60,000 వరకు ఉండగా, ఇంచుమించు ఇదే ధరకు ఐఫోన్ 16 కూడా లభిస్తోంది! మరి ఈ రెండింటిలో ఏది కొనాలి? అసలు రెండింటి మధ్య తేడా ఏంటి? ఇక్కడ తెలుసుకోండి..

Published on: Mar 22, 2026, 11:20:07 IST
Advertisement
<p><strong>డిజైన్​ అండ్​ డిస్​ప్లే-</strong> ఐఫోన్ 17ఈ, ఐఫోన్ 16 రెండూ 6.1 అంగుళాల సూపర్ రెటినా డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. రెండింటికీ అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. అయితే, ఇక్కడే ఐఫోన్ 16 కొంచెం ముందడుగు వేసింది. ఐఫోన్ 16లో అత్యధిక బ్రైట్‌నెస్ ఉండటమే కాకుండా, యాపిల్ లేటెస్ట్ ఫీచర్ <strong>‘</strong>డైనమిక్ ఐలాండ్’ ఉంది. ఇది ఫోన్‌కు ప్రీమియం లుక్‌ను ఇవ్వడమే కాకుండా, వాడకంలో కూడా చాలా అప్‌డేటెడ్‌గా అనిపిస్తుంది. ఇక ఐఫోన్ 17ఈ డిస్‌ప్లే బాగున్నప్పటికీ, ఐఫోన్ 16 ఇచ్చే ఆ ప్రీమియం ఫీల్ ఇందులో కొంచెం తక్కువగా ఉండవచ్చు. </p>

డిజైన్​ అండ్​ డిస్​ప్లే- ఐఫోన్ 17ఈ, ఐఫోన్ 16 రెండూ 6.1 అంగుళాల సూపర్ రెటినా డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. రెండింటికీ అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. అయితే, ఇక్కడే ఐఫోన్ 16 కొంచెం ముందడుగు వేసింది. ఐఫోన్ 16లో అత్యధిక బ్రైట్‌నెస్ ఉండటమే కాకుండా, యాపిల్ లేటెస్ట్ ఫీచర్ డైనమిక్ ఐలాండ్’ ఉంది. ఇది ఫోన్‌కు ప్రీమియం లుక్‌ను ఇవ్వడమే కాకుండా, వాడకంలో కూడా చాలా అప్‌డేటెడ్‌గా అనిపిస్తుంది. ఇక ఐఫోన్ 17ఈ డిస్‌ప్లే బాగున్నప్పటికీ, ఐఫోన్ 16 ఇచ్చే ఆ ప్రీమియం ఫీల్ ఇందులో కొంచెం తక్కువగా ఉండవచ్చు.

ప్రాసెసర్​ అండ్​ పర్ఫార్మెన్స్​- ఐఫోన్ 17ఈలో యాపిల్ అత్యంత శక్తివంతమైన, సరికొత్త ఏ19 సిరీస్ చిప్ ఉంది. ఇది ఐఫోన్ 17 సిరీస్‌లో వాడే ప్రాసెసరే. దీనివల్ల ఫోన్ పనితీరు చాలా వేగంగా ఉంటుంది, ఏఐ ఫీచర్లు మెరుగ్గా పనిచేస్తాయి, భవిష్యత్తులో వచ్చే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఎక్కువ కాలం అందుతాయి. ఇక ఐఫోన్​ 16లో ఏ18 ప్రాసెసర్ ఉంది. ఇది కూడా చాలా పవర్‌ఫుల్ చిప్ అయినప్పటికీ, గ్రాఫిక్స్ విషయంలో ఇది 17ఈ కంటే కొంచెం మెరుగ్గా ఉంటుంది. మీరు హెవీ గేమర్ అయితే ఐఫోన్ 16 ఇంకా బెస్ట్ ఆప్షన్‌గానే కనిపిస్తోంది.

కెమెరా- ఐఫోన్ 17ఈ వెనుక భాగంలో ఒకే ఒక 48-ఎంపీ ఫ్యూజన్ కెమెరా ఉంటుంది. సింగిల్ కెమెరా అయినప్పటికీ ఫోటోలు అద్భుతంగా వస్తాయి! ఇక ఐఫోన్ 16లో డ్యూయల్ కెమెరా సిస్టమ్ (48ఎంపీ మెయిన్ + 12ఎంపీ అల్ట్రా-వైడ్) ఉంది. దీనివల్ల మీరు వైడ్ యాంగిల్ షాట్స్, మ్యాక్రో ఫోటోగ్రఫీ వంటివి చేయవచ్చు. కెమెరా పరంగా ఐఫోన్ 16 ఎక్కువ ఆప్షన్లను అందిస్తుంది.

బ్యాటరీ అండ్​ ఛార్జింగ్- కొత్త Aఏ9 చిప్ పవర్ ఎఫిషియెంట్ కావడం వల్ల, ఐఫోన్ 17ఈలో బ్యాటరీ లైఫ్ కొంచెం ఎక్కువగా వస్తుంది. యాపిల్ లెక్కల ప్రకారం వీడియో ప్లేబ్యాక్ టైమ్ 17ఈలో మెరుగ్గా ఉంది. ఛార్జింగ్​లో మాత్రం ఒక ట్విస్ట్ ఉంది. ఐఫోన్ 16 వేగవంతమైన వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది (30డబ్ల్యూ అడాప్టర్‌తో 22డబ్ల్యూ వరకు). కానీ ఐఫోన్ 17ఈ కేవలం 15డబ్ల్య.ూ వైర్‌లెస్ ఛార్జింగ్‌ను మాత్రమే సపోర్ట్ చేస్తుంది.

ఏది కొనాలి?- మీకు లేటెస్ట్ చిప్‌సెట్ కావాలి, బ్యాటరీ ఎక్కువ సేపు రావాలి, తక్కువ ధరలో ఎక్కువ స్టోరేజ్ కావాలి అనుకుంటే ఐఫోన్​ 17ఈ తీసుకోవచ్చు. కు అద్భుతమైన కెమెరా సెటప్ (అల్ట్రా-వైడ్ లెన్స్‌తో), డైనమిక్ ఐలాండ్ లుక్, వేగవంతమైన ఛార్జింగ్, మెరుగైన గేమింగ్ అనుభవం కావాలనుకుంటే ఇప్పటికీ ఐఫోన్​ 16 బెస్ట్ ప్యాకేజీ అవుతుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe