...
...
Next Story

IPL 2026: అవార్డుల్లోనూ మోత మోగించిన వైభవ్ సూర్యవంశీ.. ఆరెంజ్ క్యాప్ సహా అయిదు.. ఓ కారు, 55 లక్షలు.. ఫుల్ లిస్ట్ ఇదే

IPL 2026: ఐపీఎల్ 2026లో పరుగుల మోత మోగించిన వైభవ్ సూర్యవంశీ.. అవార్డుల్లోనూ అదరగొట్టాడు. అత్యధిక పరుగుల వీరుడిగా ఆరెంజ్ క్యాప్ తో సహా ఏకంగా అయిదు అవార్డులు ఖాతాలో వేసుకున్నాడు. ఓ కారు కూడా దక్కించుకున్నాడు. పూర్తి అవార్డుల లిస్ట్ పై ఓ లుక్కేయండి.

Published on: Jun 1, 2026, 08:48:41 IST
Advertisement
<p>15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ అవార్డుల మోత మోగించాడు. ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు), ఎమర్జింగ్ ప్లేయర్, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ (స్ట్రైక్ రేట్), సూపర్ సిక్సెస్ (అత్యధిక సిక్సర్లు), మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ అవార్డులు అందుకున్నాడు. వీటితో పాటు రూ.55 లక్షల ప్రైజ్ మనీ, టాటా సియోరా కారు కూడా దక్కించుకున్నాడు.</p>

15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ అవార్డుల మోత మోగించాడు. ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు), ఎమర్జింగ్ ప్లేయర్, సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ (స్ట్రైక్ రేట్), సూపర్ సిక్సెస్ (అత్యధిక సిక్సర్లు), మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ అవార్డులు అందుకున్నాడు. వీటితో పాటు రూ.55 లక్షల ప్రైజ్ మనీ, టాటా సియోరా కారు కూడా దక్కించుకున్నాడు.

అత్యధిక వికెట్ల వీరుడికి ఇచ్చే పర్పుల్ క్యాప్ ను గుజరాత్ టైటాన్స్ బౌలర్ రబాడ దక్కించుకున్నాడు.

క్యాచ్ ఆఫ్ ది సీజన్ అవార్డును కేకేఆర్ ప్లేయర్ మనీష్ పాండే సొంతం చేసుకున్నాడు. ఆర్సీబీ బ్యాటర్ టిమ్ డేవిడ్ క్యాచ్ ను అద్భుతంగా పట్టినందుకు ఈ అవార్డు దక్కింది.

గుజరాత్ టైటాన్స్ మరో పేసర్ సిరాజ్ కూడా ఓ అవార్డు అందుకున్నాడు. ఈ సీజన్ లో అత్యధిక డాట్ బాల్స్ (172) వేసినందుకు గ్రీన్ డాట్ బాల్ అవార్డు అతని ఖాతాలో చేరింది.

గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ ఏమో అత్యధిక ఫోర్లు బాదిన ఆటగాడిగా నిలిచాడు. ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కింగ్ కోహ్లికి దక్కింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe