...
...
Next Story

RCB vs GT : ఆర్సీబీకి రూ. 20కోట్లు, జీటీకి రూ. 12.5కోట్లు- SRH టీమ్​కి ప్రైజ్​ మనీ ఎంతంటే…

IPL 2026 : దేశంలో ఐపీఎల్​ మహా సమరం ముగిసింది. రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు రెండోసారి ట్రోఫీని దక్కించుకుంది. మరీ విన్నర్​గా ఆర్సీబీకి, రన్నరప్​గా జీటీకి, ఎలిమినేటర్​లో ఓడిపోయిన ఎస్​ఆర్​హెచ్​కి ప్రైజ్​ మనీ ఎంత దక్కిందో ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jun 1, 2026, 11:40:27 IST
Advertisement
<p>ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా రెండోసారి ట్రోఫీని గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ చారిత్రాత్మక విజయంతో ఆర్సీబీ రికార్డులు సృష్టించడమే కాకుండా భారీ ప్రైజ్ మనీని సైతం దక్కించుకుంది.</p>

ఐపీఎల్ 2026 గ్రాండ్ ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వరుసగా రెండోసారి ట్రోఫీని గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ చారిత్రాత్మక విజయంతో ఆర్సీబీ రికార్డులు సృష్టించడమే కాకుండా భారీ ప్రైజ్ మనీని సైతం దక్కించుకుంది.

ఐపీఎల్ 2026 విజేతగా నిలిచిన ఆర్సీబీ జట్టుకు ఏకంగా రూ. 20 కోట్ల నగదు బహుమతి లభించింది. రన్నరప్‌గా నిలిచిన శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ (జీటీ) జట్టుకు రూ. 12.5 కోట్లు దక్కాయి.

ప్లేఆఫ్స్ చేరిన మిగిలిన రెండు జట్లు రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా కోట్ల రూపాయల ప్రైజ్ మనీని అందుకున్నాయి. ఆర్​ఆర్​కి రూ. 7కోట్లు, ఎస్​ఆర్​హెచ్​కి 6.5కోట్లు లభించాయి.

విన్నర్ ప్రైజ్​ మనీ చూస్తే చాలు.. ఐపీఎల్​ ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ఖరీదైన లీగ్​ అని తెలిసిపోతుంది. ఉదాహరణకు ఐపీఎల్​ విన్నర్​కి రూ. 20కోట్ల ప్రైజ్​ మనీ వస్తుండగా, పాకిస్థాన్ ప్రీమియర్​ లీగ్​లో అది కేవలం రూ. 4.5కోట్లే!

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe