...
...
Next Story

IPL 2026 playoffs : 1 స్పాట్.. 5 టీమ్స్​! ఐపీఎల్​ ప్లేఆఫ్స్​కి వెళ్లే జట్టు ఏది?

ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు పీక్ స్టేజ్‌కు చేరుకుంది. సీఎస్కేపై ఎస్​ఆర్​హెచ్ గెలుపుతో టోర్నీలో సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ఇప్పటికే మూడు జట్లు ప్లేఆఫ్స్ బెర్త్‌లను కన్ఫర్మ్ చేసుకోగా.. ముంబై, లక్నో జట్లు అధికారికంగా రేసు నుంచి తప్పుకున్నాయి. మిగిలి ఉన్న ఒక్క స్థానం కోసం ఏకంగా 5 జట్ల మధ్య పోటీ ఉంది.

Published on: May 19, 2026, 11:18:33 IST
Advertisement
<p>ప్రస్తుత పాయింట్ల పట్టిక ప్రకారం టాప్-3 స్థానాల్లో ఉన్న జట్లు సేఫ్ జోన్‌లోకి వెళ్లాయి. మిగిలిన జట్లు గరిష్టంగా 16 పాయింట్లకు మించి సాధించే అవకాశం లేకపోవడంతో ఈ మూడు జట్ల బెర్త్ కన్ఫర్మ్ అయింది. అవి.. ఆర్సీబీ, జీటీ, ఎస్​ఆర్​హెచ్.</p>

ప్రస్తుత పాయింట్ల పట్టిక ప్రకారం టాప్-3 స్థానాల్లో ఉన్న జట్లు సేఫ్ జోన్‌లోకి వెళ్లాయి. మిగిలిన జట్లు గరిష్టంగా 16 పాయింట్లకు మించి సాధించే అవకాశం లేకపోవడంతో ఈ మూడు జట్ల బెర్త్ కన్ఫర్మ్ అయింది. అవి.. ఆర్సీబీ, జీటీ, ఎస్​ఆర్​హెచ్.

మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (ఎంఐ)తో పాటు లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్​ఎస్​జీ) జట్లు ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించాయి. ఇక మిగిలిన ఐదు జట్లు, ఒక బెర్త్​ కోసం పోటీపడుతున్నాయి.

రాజస్థాన్ రాయల్స్ (ఆర్​ఆర్): ప్రస్తుతం 12 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లతో ఉన్న రాజస్థాన్‌కు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ రెండూ గెలిస్తే ఈ జట్టు గరిష్టంగా 16 పాయింట్లకు చేరుకుని నాలుగో జట్టుగా సులభంగా క్వాలిఫై అవ్వొచ్చు!

పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్): 13 మ్యాచ్‌ల్లో 13 పాయింట్లతో ఉన్న పంజాబ్‌కు ఒకే ఒక్క మ్యాచ్ మిగిలి ఉంది. చివరి మ్యాచ్ గెలిచి 15 పాయింట్లతో నిలిచి, మిగిలిన జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

సీఎస్కే, డీసీ- ఈ రెండు జట్లు తలో 13 మ్యాచ్‌లు ఆడి 12 పాయింట్లతో ఉన్నాయి. వీరికి చెరో మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. చివరి మ్యాచ్ గెలిచినా ఇవి గరిష్టంగా 14 పాయింట్లకు మాత్రమే చేరుకోగలవు. కాబట్టి వీరు తమ మ్యాచ్‌లు భారీ రన్ రేట్‌తో గెలవడమే కాకుండా.. పంజాబ్, రాజస్థాన్, కోల్‌కతా జట్లు తమ తదుపరి మ్యాచ్‌ల్లో ఓడిపోవాలని ప్రార్థించాలి! అప్పుడు వీటిల్లో ఏదో ఒకటి ప్లేఆఫ్స్​కి వెళుతుంది.

కేకేఆర్​- 12 మ్యాచ్‌ల్లో 11 పాయింట్లతో ఉన్న కేకేఆర్‌కు రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ రెండూ గెలిస్తే వారు 15 పాయింట్లకు చేరుకుంటారు. అప్పుడు నెట్ రన్ రేట్ ఆధారంగా ప్లేఆఫ్స్ రేసు మారుతుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe