...
...
Next Story

Romance scam : ఆన్‌లైన్ ‘లవ్ ట్రాప్’- ప్రేమిస్తున్నానంటూ ముంచేస్తున్న ముఠాలు! ఈ 7 సంకేతాలు తెలుసుకోండి..

డిజిటల్ యుగంలో స్నేహం, పరిచయాలు ఎంతో సులభంగా మారుతున్నాయి. అయితే ఆన్‌లైన్ ప్రపంచంలో వినిపించే ప్రతి తియ్యటి మాటా, కనిపించే ప్రతి ఆకర్షణీయమైన ప్రొఫైలూ నిజమైనది అనుకుంటే ఊహించని నష్టం చూడాల్సి వస్తుంది! 'డిజిటల్ రొమాన్స్ స్కామ్‌ల' కోసం అనుసరించే 7 ప్రధాన సంకేతాలపై ప్రత్యేక కథనం..

Published on: Oct 24, 2026, 11:21:08 IST
Advertisement
<p>ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా 'డిజిటల్ రొమాన్స్ స్కామ్‌లు' శరవేగంగా పెరుగుతున్నాయి. ఆకర్షణీయమైన ఫొటోలు, సానుభూతి మాటలతో వల విసిరి, బాధితుల నుంచి లక్షలాది రూపాయల సొమ్మును దొంగిలించే ముఠాలు క్రియాశీలకంగా మారాయి. ఈ తరహా నేరాల వెనుక ఉన్న అసలు క్రైమ్ పాటర్న్‌ను విశ్లేషిస్తూ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు బుగల్ కీలక విషయాలు వెల్లడించారు. "డిజిటల్ రొమాన్స్ స్కామ్ అనేది ప్రేమ రూపంలో చేసే ఒక పక్కా వ్యూహాత్మక నేరం. నేరగాళ్లకు మీపై ఎలాంటి ఆప్యాయత ఉండదు. వారి ఏకైక లక్ష్యం మీ వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేయడం, మిమ్మల్ని మానసికంగా కంట్రోల్ చేయడం, చివరికి మీ బ్యాంకు ఖాతాలను ఖాళీ చేయడమే," అని ఆయన హెచ్చరించారు.</p>

ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా 'డిజిటల్ రొమాన్స్ స్కామ్‌లు' శరవేగంగా పెరుగుతున్నాయి. ఆకర్షణీయమైన ఫొటోలు, సానుభూతి మాటలతో వల విసిరి, బాధితుల నుంచి లక్షలాది రూపాయల సొమ్మును దొంగిలించే ముఠాలు క్రియాశీలకంగా మారాయి. ఈ తరహా నేరాల వెనుక ఉన్న అసలు క్రైమ్ పాటర్న్‌ను విశ్లేషిస్తూ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు బుగల్ కీలక విషయాలు వెల్లడించారు. "డిజిటల్ రొమాన్స్ స్కామ్ అనేది ప్రేమ రూపంలో చేసే ఒక పక్కా వ్యూహాత్మక నేరం. నేరగాళ్లకు మీపై ఎలాంటి ఆప్యాయత ఉండదు. వారి ఏకైక లక్ష్యం మీ వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేయడం, మిమ్మల్ని మానసికంగా కంట్రోల్ చేయడం, చివరికి మీ బ్యాంకు ఖాతాలను ఖాళీ చేయడమే," అని ఆయన హెచ్చరించారు.

కేవలం డేటింగ్ యాప్‌లకే పరిమితం కాకుండా ఇన్​స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్, చివరికి లింక్డ్‌ఇన్ వంటి ప్రొఫెషనల్ ప్లాట్‌ఫామ్‌ల్లోనూ ఈ తరహా ముఠాలు తిరుగుతున్నాయి. బాధితుల సోషల్ మీడియా ఖాతాలను నిశితంగా పరిశీలించి వారి ఇష్టాయిష్టాలు, అలవాట్లను తెలుసుకుంటారు. దానికి అనుగుణంగా ఫేక్ ప్రొఫైళ్లు క్రియేట్ చేసి, వారాల తరబడి మాట్లాడి బాధితులు తమపై మానసికంగా ఆధారపడేలా చేసుకుంటారు. అనంతరం వాట్సాప్ వంటి యాప్‌లకు సంభాషణను మళ్లిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేరుగా కలవడానికి గానీ, వీడియో కాల్స్ మాట్లాడటానికి గానీ వీరు అంగీకరించరు. విదేశీ ఉద్యోగం, అత్యవసర ప్రయాణం లేదా కుటుంబ సమస్యలు అంటూ ఏదో ఒక నమ్మదగిన సాకు చెబుతుంటారు.

బాధితుల నమ్మకాన్ని పూర్తిగా చూరగొన్న తర్వాతే స్కామర్లు డబ్బుల ప్రస్తావన తెస్తారు. 7 లక్షణాలు కనిపిస్తే అది పక్కా మోసమని గ్రహించాలి. అవి.. మోడల్స్ లాగా ఎంతో ఆకర్షణీయమైన ఫొటోలు ఉంటాయి. గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా పరిశీలిస్తే ఆ ఫొటోలు వేరే వ్యక్తులవని లేదా ఇంటర్నెట్ నుంచి డౌన్‌లోడ్ చేసినవని తేలుతుంది. ఖాతాలో సరైన హిస్టరీ లేదా వివరాలు ఉండవు. వారు చెప్పే కథలు వినడానికి బాగానే ఉన్నా, పరిశీలిస్తే అన్నీ వైరుధ్యాలతో కూడి ఉంటాయి. వీడియో కాల్ లేదా ప్రత్యక్ష కలయికల నుంచి తప్పించుకోవడానికి వీసా ఇబ్బందులు, నెట్‌వర్క్ సమస్యలు లేదా ఆకస్మిక అనారోగ్యం అంటూ రకరకాల సాకులు చెబుతారు.

నమ్మకం కుదిరిన తర్వాత విమానం టికెట్లు, ఆసుపత్రి బిల్లులు లేదా లీగల్ ఫీజుల పేరుతో డబ్బులు అడగడం ప్రారంభిస్తారు. ఒక అత్యవసరం తీరగానే మరో సమస్యను ముందుకు తెస్తారు. క్రిప్టోకరెన్సీ, గిఫ్ట్ కార్డ్‌లు లేదా ఇంటర్నేషనల్ వైర్ ట్రాన్స్‌ఫర్‌ల ద్వారా మాత్రమే డబ్బులు పంపాలని ఒత్తిడి తెస్తారు. ఇవి వేగంగా బదిలీ అయ్యి, తిరిగి రికవరీ చేయడానికి వీలులేకుండా ఉంటాయి.

విదేశాల నుంచి అత్యంత ఖరీదైన కానుకలు లేదా విదేశీ కరెన్సీ పంపామని, కస్టమ్స్ క్లియరెన్స్ లేదా కొరియర్ ఛార్జీల కోసం డబ్బులు కట్టాలని కొత్త నాటకానికి తెరలేపుతారు. ఈ పరిచయం గురించి కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు చెప్పవద్దని కోరతారు. ప్రశ్నలు అడిగితే నమ్మకం లేదంటూ మానసికంగా వేధిస్తారు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే మీరు జాగ్రత్త పడాలి.

ఈ మోసాల్లో కేవలం డబ్బు కోల్పోవడమే కాకుండా వ్యక్తిగత దస్తావేజులు, బ్యాంకు లాగిన్ వివరాలు, పాస్‌వర్డ్‌లు, ప్రైవేట్ ఫొటోలు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. "బాధితులకు తెలియకుండానే వారి ఖాతాల ద్వారా అక్రమ నగదు మార్పిడి చేయిస్తూ వారిని 'మనీ మూల్స్'గా మారుస్తున్నారు. ఒకవేళ ప్రైవేట్ చిత్రాలు షేర్ చేసి ఉంటే, వాటిని నెట్‌లో పెడతామని బెదిరిస్తూ సెక్స్‌టార్షన్ కింద మరిన్ని డబ్బులు లాగుతున్నారు," అని బుగల్ వివరించారు. ఆన్‌లైన్ పరిచయాల పట్ల అపరిమితమైన జాగ్రత్త వహించడం ఒక్కటే ఈ మోసాల నుంచి తప్పించుకునే మార్గం. ఏదైనా అనుమానం వస్తే వెంటనే సంభాషణ నిలిపివేసి, సైబర్ క్రైమ్ ఉచిత హెల్ప్‌లైన్ నంబర్ 1930 లేదా అధికారిక జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్‌ను సంప్రదించాలి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks