...
...
Next Story

Phone under 2000 : ఐటెల్​ ఆక్వా లాంచ్.. రూ.1,799కే వాటర్‌ప్రూఫ్ ఫోన్!

Itel Aqua price : ప్రముఖ మొబైల్ బ్రాండ్ ఐటెల్ భారతదేశంలో తన సరికొత్త ఫీచర్ ఫోన్ ‘ఐటెల్ ఆక్వా’ని లాంచ్ చేసింది. అతి తక్కువ ధరకే ఈ ఫోన్‌కు ధూళి, నీటి నుంచి రక్షణ కల్పించే ఐపీ67 రేటింగ్ ఇవ్వడం విశేషం. ఈ గ్యాడ్జెట్​ ఫీచర్స్​, ధర వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: Jun 2, 2026, 11:18:59 IST
Advertisement
<p>ఐటెల్ కంపెనీ సాధారణ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని, తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్లను అందించే లక్ష్యంతో 'ఐటెల్ ఆక్వా'ను మార్కెట్లోకి తెచ్చింది. రఫ్ అండ్ టఫ్ వాడకానికి, అవుట్‌డోర్ పరిస్థితులకు ఇది పర్ఫెక్ట్ ఆప్షన్ అని కంపెనీ పేర్కొంది. భారతదేశంలో ఐటెల్ ఆక్వా ఫీచర్ ఫోన్ ధరను కేవలం రూ. 1,799గా నిర్ణయించారు. ఇది బ్లూ, రెడ్, బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.</p>

ఐటెల్ కంపెనీ సాధారణ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని, తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్లను అందించే లక్ష్యంతో 'ఐటెల్ ఆక్వా'ను మార్కెట్లోకి తెచ్చింది. రఫ్ అండ్ టఫ్ వాడకానికి, అవుట్‌డోర్ పరిస్థితులకు ఇది పర్ఫెక్ట్ ఆప్షన్ అని కంపెనీ పేర్కొంది. భారతదేశంలో ఐటెల్ ఆక్వా ఫీచర్ ఫోన్ ధరను కేవలం రూ. 1,799గా నిర్ణయించారు. ఇది బ్లూ, రెడ్, బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

ఈ ఐటెల్​ ఆక్వా ఫీచర్​ ఫోన్​లో 2.4-ఇంచుల డిస్‌ప్లేను అందించారు. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా మెరుగైన బ్రైట్‌నెస్ లెవెల్స్ ఇందులో ఉన్నాయి. ఈ ఫోన్‌లో 1,000 కాంటాక్ట్‌లు (కాంటాక్ట్ ఐకాన్స్‌తో సహా), 250 మెసేజ్‌లు, 60 కాల్ లాగ్‌లను దాచుకోవచ్చు. మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 32జీబీ వరకు పెంచుకునే సదుపాయం ఉంది.

ఫోన్ వెనుక భాగంలో వీజీఏ రేర్ కెమెరా ఉంది. స్పష్టమైన వాయిస్ కాల్స్ కోసం ఇందులో ఏఐ ఎన్విరామెంటల్ నాయిస్ కాన్సిలేషన్ ఫీచర్ ఇచ్చారు. ఇది మాట్లాడేటప్పుడు చుట్టుపక్కల ఉండే అనవసర శబ్దాలను తగ్గించి కాల్స్ క్లియర్‌గా వినిపించేలా చేస్తుంది.

బడ్జెట్ ధరలో ఉన్నప్పటికీ దీని బిల్డ్ క్వాలిటీ, బ్యాటరీ లైఫ్ చాలా అద్భుతంగా ఉన్నాయి. 1,200mAh బ్యాటరీ + సూపర్ బ్యాటరీ మోడ్ దీని సొంతం. యూఏస్బీ టైప్​ సీ ఛార్జింగ్​తో ఇది వస్తుంది. ఈ ఐటెల్​ ఆక్వాకి ఐపీ67 వాటర్​ అండ్​ డస్ట్​ రెసిస్టెన్స్​ లభిస్తోంది. బ్లూటూత్ (ఫైల్ షేరింగ్ సపోర్ట్), వైర్‌లెస్ ఎఫ్‌ఎమ్ రేడియో (రికార్డింగ్‌తో) వంటి ఫీచర్లతో ఈ మొబైల్​ వస్తోంది. ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్, స్పీడ్ డయల్, టైమ్ అప్‌డేట్ వంటివి ఇతర ఫీచర్లుగా ఉన్నాయి.

ఈ ఐటెల్​ ఆక్వాలో 'కింగ్ వాయిస్' అనే ద్విభాషా వాయిస్ అసిస్టెన్స్ ఫీచర్ ఉంది. ఇది ఇంగ్లీష్, హిందీ భాషల్లో మెనూ ప్రాంప్ట్‌లు, కాల్ సమాచారం, నోటిఫికేషన్‌లను చదివి వినిపిస్తుంది. అంతేకాకుండా ఈ ఫోన్ తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, కన్నడ, మలయాళంతో సహా మొత్తం 10 భారతీయ భాషలను సపోర్ట్ చేస్తుంది. తక్కువ బడ్జెట్‌లో సెకండరీ ఫోన్ లేదా పేరెంట్స్ కోసం ఫోన్ వెతికే వారికి ఇది మంచి ఆప్షన్.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe