...
...
Next Story

Jee main session 2 result : ఏ క్షణంలోనైనా జేఈఈ మెయిన్ సెషన్​ 2 ఫలితాలు! ఇలా చెక్​ చేసుకోండి..

Jee main session 2 result : మీడియా కథనాల ప్రకారం జేఈఈ మెయిన్ 2026 సెషన్​ 2 ఫలితాలు ఈరోజు, ఏప్రిల్​ 20న విడుదలకానున్నాయి. మరి ఫలితాలను ఎలా చెక్​ చేసుకోవాలి? ఇక్కడ వివరంగా తెలుసుకోండి..

Published on: Apr 20, 2026, 10:44:02 IST
Advertisement
<p>ఈ ఏడాది జేఈఈ మెయిన్స్ సెషన్ 2 పరీక్షలు ఏప్రిల్ 2, 4, 5, 6, 7, 8 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో జరిగాయి. దేశవ్యాప్తంగా 304 నగరాల్లో, విదేశాల్లోని మరో 14 ప్రాంతాల్లో కలిపి మొత్తం 566 పరీక్షా కేంద్రాల్లో ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) ఈ పరీక్షను నిర్వహించింది.</p>

ఈ ఏడాది జేఈఈ మెయిన్స్ సెషన్ 2 పరీక్షలు ఏప్రిల్ 2, 4, 5, 6, 7, 8 తేదీల్లో కంప్యూటర్ ఆధారిత పద్ధతిలో జరిగాయి. దేశవ్యాప్తంగా 304 నగరాల్లో, విదేశాల్లోని మరో 14 ప్రాంతాల్లో కలిపి మొత్తం 566 పరీక్షా కేంద్రాల్లో ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) ఈ పరీక్షను నిర్వహించింది.

జేఈఈ మెయిన్ 2026 సెషన్​ 2 ఫలితాలను ఎలా చెక్​ చేసుకోవాలి? : ముందుగా ఎన్టీఏ జేఈఈ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in సందర్శించండి. ఆ తర్వాత హోమ్ పేజీలో కనిపించే 'JEE Mains Result 2026 Session 2' లింక్‌పై క్లిక్ చేయండి.

అనంతరం మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ (Login Details) నమోదు చేయండి. సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయగానే మీ స్కోర్​కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

జేఈఈ మెయిన్ 2026 సెషన్​ 2 ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకుని, భవిష్యత్తు అవసరాల కోసం ఒక ప్రింటవుట్ తీసుకోవడం మర్చిపోకండి.

జేఈఈ మెయిన్ ఫలితాల్లో టాప్ 2.5 లక్షల లోపు ర్యాంకు సాధించిన విద్యార్థులు ఐఐటీల్లో ఎంట్రీ కోసం నిర్వహించే 'జేఈఈ అడ్వాన్స్‌డ్' పరీక్షకు అర్హత సాధిస్తారు. అందుకే ఫలితాలు వచ్చిన వెంటనే అడ్వాన్స్‌డ్ పరీక్షకు సిద్ధమవ్వడం ఉత్తమం. ఎన్​ఐటీ, ట్రిపుల్ ఐటీల్లో సీట్లు ఆశించే వారు మాత్రం ఈ మెయిన్ ఫలితాలతో జోసా కౌన్సెలింగ్ ప్రక్రియపై దృష్టి సారించాల్సి ఉంటుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe