...
...
Next Story

OTT Trending: ఈ వారం జియోహాట్‌స్టార్ ట్రెండింగ్ సినిమాలు, సిరీస్‌లు..బోల్డ్ మూవీస్ కూడా..రెండు 18+ వాళ్ల‌కే..లుక్కేయండి

OTT Trending: పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్ లో ట్రెండింగ్ సినిమాలు, సిరీస్ లపై ఓ లుక్కేయండి. ఇందులో బోల్డ్ ఫిల్మ్స్ కూడా ఉన్నాయి. సస్పెన్స్ తో థ్రిల్ పంచే చిత్రాలను కూడా చూడొచ్చు

Published on: May 26, 2026, 13:10:47 IST
Advertisement
<p>ఈ వారం జియోహాట్‌స్టార్ టాప్ 6 సినిమాలు, వెబ్ సిరీస్‌ల లిస్ట్ ఇక్కడుంది. ఈ సినిమాలు, సిరీస్‌లకు ఓటీటీలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇందులో 2 సినిమాలు 18+ వాళ్లకు మాత్రమే.</p>

ఈ వారం జియోహాట్‌స్టార్ టాప్ 6 సినిమాలు, వెబ్ సిరీస్‌ల లిస్ట్ ఇక్కడుంది. ఈ సినిమాలు, సిరీస్‌లకు ఓటీటీలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇందులో 2 సినిమాలు 18+ వాళ్లకు మాత్రమే.

ధురంధర్ - రా అండ్ అన్‌ దేఖా: జియోహాట్‌స్టార్‌లో 'ధురంధర్ - రా అండ్ అన్‌ దేఖా' మూవీ అదరగొడుతోంది. ట్రెండింగ్ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.

ది అమెజింగ్ స్పైడర్ మాన్ - మీకు మార్వెల్ సూపర్‌హీరో సినిమాలు ఇష్టమైతే, ‘ది అమెజింగ్ స్పైడర్‌మాన్’ ఫస్ట్ పార్ట్ ను జియోహాట్‌స్టార్‌లో చూడవచ్చు. ఇప్పుడీ మూవీ ట్రెండింగ్ లో అదరగొడుతోంది.

ది అమెజింగ్ స్పైడర్ మాన్ 2 - సెకండ్ పార్ట్ కూడా ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. ది అమెజింగ్ స్పైడర్ మాన్ 2 కూడా మంచి వ్యూయర్ షిప్ సాధిస్తోంది.

ఆస్క్ మీ వాట్ యూ వాంట్? - కొంచెం బోల్డ్, ఇంటెన్స్ మూవీ చూడాలనుకుంటే జియోహాట్‌స్టార్‌లోని ఆస్క్ మీ వాట్ యూ వాంట్ పై లుక్కేయండి. కానీ ఇది 18 ప్లస్ వాళ్లకు మాత్రమే.

హౌస్ ఆఫ్ డార్క్ నెస్ - ఓ బార్ లో ఓ అమ్మాయిని హీరో కలుస్తాడు. ఆ బ్యూటీఫుల్ లేడీని ఇంటికి తీసుకెళ్తాడు. కానీ ఆ తర్వాత ఓ పెద్ద సమస్య ఎదురవుతుంది. ఈ బోల్డ్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ కూడా పెద్దవాళ్లకు మాత్రమే.

ఇన్ స్పెక్టర్ అవినాష్ సీజన్ 2 - ఈ సిరీస్ మొదటి భాగం సూపర్ హిట్‌గా నిలిచింది. ఇన్ స్పెక్టర్ అవినాష్ సీజన్ 2 కూడా వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సిరీస్ ఆడియన్స్ ను ఉర్రూతలూగిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe