...
...
Next Story

TG LAWCET Counselling 2026 : తెలంగాణ లాసెట్ అభ్యర్థులకు అప్డేట్ - ఈనెల 26న కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల

TG Lawcet Counselling 2026 : తెలంగాణలో ఎల్‌ఎల్‌బీ ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియకు ముహూర్తం ఖరారైంది. జూన్ 26న కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.

Published on: Jun 23, 2026 11:59 AM IST
Advertisement
<p>తెలంగాణలో లా కోర్సుల్లో చేరాలని ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాల భర్తీకి సంబంధించిన లాసెట్ (LAWCET-2026), పీజీఎల్‌సిఈటీ కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను ఈ నెల 26వ తేదీన విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.</p><p> </p>

తెలంగాణలో లా కోర్సుల్లో చేరాలని ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాల భర్తీకి సంబంధించిన లాసెట్ (LAWCET-2026), పీజీఎల్‌సిఈటీ కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను ఈ నెల 26వ తేదీన విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.

హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సోమవారం నాడు పీజీఈసెట్, లాసెట్ ప్రవేశాల కమిటీల ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ ఉమ్మడి సమావేశంలో కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించిన విధివిధానాలు, షెడ్యూల్‌పై అధికారులు సుదీర్ఘంగా చర్చించారు.

అన్ని ఏర్పాట్లను సమీక్షించిన అనంతరం, జూన్ 26వ తేదీన అధికారికంగా కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను జారీ చేయాలని కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లా కాలేజీల్లో మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఐదేళ్ల సమగ్ర (ఇంటిగ్రేటెడ్) ఎల్‌ఎల్‌బీ కోర్సులతో పాటు పీజీ లా కోర్సుల్లో సీట్లను భర్తీ చేయనున్నారు.

అర్హులైన అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నిర్దేశిత వెబ్‌సైట్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకుని, వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల నమోదు తదితర పూర్తి స్థాయి వివరాలతో కూడిన సమగ్ర షెడ్యూల్‌ను 26న విడుదల చేసే ప్రకటనలో అధికారులు వెల్లడించనున్నారు. https://lawcet.tgche.ac.in/ వెబ్ సైట్ నుంచి ర్యాంక్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe