...
...
Next Story

TG Inter Results 2026 : తెలంగాణ ఇంటర్ ఫలితాల కోసం చూస్తున్నారా..? ఈ కొత్త అప్డేట్స్ తెలుసుకోండి

Telangana Inter Results 2026 : తెలంగాణ ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి అయింది. ప్రస్తుతం సాంకేతిక అంశాలను పరిశీలిస్తున్నారు. అయితే ఈ ఫలితాలను ఏప్రిల్ 10 లేదా 12 తేదీల్లో వెలువడే చాన్స్ ఉంది.

Published on: Apr 6, 2026, 10:04:34 IST
Advertisement
<p>రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు కలిపి 9 లక్షలకుపైగా విద్యార్థులు ఎగ్జామ్స్ కు హాజరయ్యారు. మొదటి సంవత్సరానికి సంబంధించి 4 లక్షల మంది, రెండో సంవత్సరానికి సంబంధించి 5 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా ప్రస్తుతం ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.</p>

రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు కలిపి 9 లక్షలకుపైగా విద్యార్థులు ఎగ్జామ్స్ కు హాజరయ్యారు. మొదటి సంవత్సరానికి సంబంధించి 4 లక్షల మంది, రెండో సంవత్సరానికి సంబంధించి 5 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా ప్రస్తుతం ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

స్పాట్ వాల్యూయేషన్ ప్రాసెస్ పూర్తి కావటంతో…. ప్రాసెస్ ప్రక్రియ కొనసాగుతోంది. మార్కుల ఎంట్రీ, సాంకేతిక అంశాలు, ఫలితాల క్రోడీకరణ తది దశలో ఉన్నాయి. రెండు మూడు రోజుల్లో ఇవన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది.

ఏప్రిల్ 10 నుంచి 12వ తేదీల మధ్యలో ఫలితాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వ అనుమతి తీసుకొని ఫలితాల విడుదల కోసం ఓ తేదీని ఖరారు చేస్తారు. ఒకే రోజు ఫస్ట్ ఇయర్ తో పాటు సెకండియర్ ఫలితాలు అందుబాటులోకి వస్తాయి.

గతేడాదిలో చూస్తే… తెలంగాణలో ఇంటర్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 22వ తేదీన విడుదలయ్యాయి. అయితే ఈసారి మాత్రం త్వరగానే ఫలితాలు అందుబాటులోకి రానున్నాయి. సాధ్యమైనంత త్వరగానే రిజల్ట్స్ ప్రకటించాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది.

తెలంగాణ ఇంటర్ ఫలితాలు https://www.tgbie.in/index.html వెబ్ సైట్ లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్ ఫలితాలు 2026 లింక్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ విద్యార్థి హాల్‌టికెట్ నెంబర్ ను నమోదు చేయాలి. సబ్మిట్ బటన్ పై క్లిక్ చేస్తే ఫలితాలు డిస్ ప్లే అవుతాయి. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి రిజల్ట్ కాపీని పొందాల్సి ఉంటుంది.

గతేడాది మాదిరిగానే ఈసారి కూడా హిందుస్తాన్ టైమ్స్ వెబ్ సైట్ ( https://www.hindustantimes.com/telugu ) లో కూడా తెలంగాణ ఇంటర్ ఫలితాలు అందుబాటులో ఉంటాయి. ఫస్ట్ ఇయర్, సెకండియర్(జనరల్, ఒకేషనల్) రిజల్ట్స్ సులభంగా చెక్ చేసుకునే వీలుంటుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe