...
...
Next Story

Kiara Advani: మళ్లీ తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ.. గ్రేటెస్ట్ గిఫ్ట్ అంటూ సోషల్ మీడియా పోస్ట్!

Kiara Advani: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ మరోసారి తల్లి కాబోతుంది. తాను రెండో సారి ప్రెగ్నెంట్ అయిన విషయాన్ని ఇవాళ (అక్టోబర్ 7) సోషల్ మీడియాలో ప్రకటించింది. కియారా- సిద్ధార్థ్ జోడీకి ఇప్పటికే ఓ అమ్మాయి ఉన్న సంగతి తెలిసిందే.

Published on: Oct 7, 2026, 13:35:00 IST
Advertisement
<p>బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. రెండో సారి తల్లి అయినట్లు సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది.</p>

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. రెండో సారి తల్లి అయినట్లు సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేసింది.

కియారా- సిద్ధార్థ్ దంపతులకు ఇప్పటికే ఓ పాప ఉంది. ఇప్పుడు రెండో ప్రెగ్నెన్సీ అనౌన్స్ మెంట్ లో ఈ కపుల్ చేతులతో పాటు ఆ పాప చేతులు కూడా ఉన్నాయి.

కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రాల వివాహం 2023 ఫిబ్రవరి 7న రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఉన్న ప్రసిద్ధ సూర్యగఢ్ ప్యాలెస్ లో జరిగింది.

కియారా- సిద్ధార్థ్ దంపతులకు 2025 జూలై 1న ఆడపిల్ల జన్మించింది. ఆమెకు సారాయా మల్హోత్రా అనే పేరు పెట్టారు.

కియారా చివరిగా టాక్సిక్ సినిమాలో కనిపించింది. యశ్ హీరోగా నటించిన ఈ మూవీలో ఆమె యాక్టింగ్ కు ప్రశంసలు దక్కాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks