...
...
Next Story

Mehreen Wedding Photos: ఇంట‌ర్నెట్‌ను షేక్ చేస్తున్న మెహ్రీన్ పెళ్లి ఫొటోలు-స‌డెన్ స‌ర్‌ప్రైజ్ అంటూ కామెంట్లు-అదే కారణమా

Mehreen Wedding Photos: ‘హనీ ఈజ్ ద బెస్ట్’ అంటూ ఎఫ్2 సినిమాలో చలాకీ నటనతో అలరించిన మెహ్రీన్ పిర్జాదా పెళ్లి చేసుకుంది. ఎలాంటి ముందస్తు అనౌన్స్ మెంట్ లేకుండా డైరెక్ట్ గా పెళ్లి ఫొటోలతో సర్ ప్రైజ్ చేసింది. ఇప్పుడీ ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

Published on: Apr 27, 2026, 11:00:51 IST
Advertisement
<p>తెలుగు సినిమాతో సినీ కెరీర్ స్టార్ట్ చేసిన మెహ్రీన్ పిర్జాదా పెళ్లి చేసుకుంది. దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టింది.</p>

తెలుగు సినిమాతో సినీ కెరీర్ స్టార్ట్ చేసిన మెహ్రీన్ పిర్జాదా పెళ్లి చేసుకుంది. దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టింది.

ఆదివారం (ఏప్రిల్ 4) మెహ్రీన్ పిర్జాదా పెళ్లి జరిగింది. అర్ష్ ఔలక ను ఆమె వెడ్డింగ్ చేసుకుంది.

సడెన్ గా పెళ్లి ఫొటోలను మెహ్రీన్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసి అందరికీ షాక్ ఇచ్చింది.

మెహ్రీన్ పెళ్లి ఫొటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. బ్యూటీఫుల్ మెహ్రీన్ సడెన్ సర్ ప్రైజ్ చేసిందని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.

అయితే పెళ్లి గురించి ముందస్తుగా ఎలాంటి ప్రకటన లేకుండా మెహ్రీన్ సర్ ప్రైజ్ చేయడం వెనుక ఓ కారణం ఉందని అంటున్నారు. గతంలో మెహ్రీన్ నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది.

హర్యానాకు చెందిన యువ పొలిటికల్ లీడర్ భవ్య బిష్ణోయ్ తో 2021లో మెహ్రీన్ ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ తర్వాత కొన్ని నెలలకే పరస్పర అంగీకారంతో వీళ్లు నిశ్చితార్థం రద్దు చేసుకున్నారు.

నాని హీరోగా వచ్చిన కృష్ణగాడి వీరప్రేమ గాథ సినిమాతో మెహ్రీన్ డెబ్యూ చేసింది. ఆ తర్వాత తెలుగులో మహానుభావుడు, రాజా ది గ్రేట్, కేరాఫ్ సూర్య, జవాన్, పంతం, కవచం, ఎఫ్2, చాణక్య, ఎంత మంచివాడవురా, అశ్వత్థామ, మంచి రోజులొచ్చాయి, ఎఫ్3 సినిమాలు చేసింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe