...
...
Next Story

Mudragada Padmanabham : ముగిసిన ముద్రగడ అంత్యక్రియలు - పాడె మోసిన వైఎస్ జగన్, ఫొటోలు

Mudragada Padmanabham Funeral : మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంతిమ సంస్కారాలు ముగిశాయి. అంతకంటే ముందు ముద్రగడ కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్…. పాడె మోసి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

Published on: Jul 15, 2026 05:21 PM IST
Advertisement
<p>మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ఆవరణలో కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.</p>

మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు ముగిశాయి. కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ఆయన ఇంటి ఆవరణలో కుటుంబసభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

ముద్రగడను కడసారి చూసేందుకు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. అంతకుముందు ముద్రగడ భౌతికకాయానికి మాజీ సీఎం జగన్‌ నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ముద్రగడ సతీమణిని, ఆయన కుమారుడు ముద్రగడ గిరిబాబును కలిసి ఓదార్చారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి వైఎస్సార్‌సీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పద్మనాభం గడిపిన క్షణాలను, ఆయనతో ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

కేవలం నివాళులర్పించి వెళ్లిపోకుండా, ముద్రగడ పద్మనాభం అంతిమ సంస్కారాల ప్రక్రియ పూర్తయ్యే వరకు వైఎస్ జగన్ అక్కడే ఉన్నారు. అనంతరం ప్రారంభమైన ముద్రగడ అంతిమయాత్రలో స్వయంగా పాల్గొన్నారు.

అంతిమయాత్ర ముందుకు సాగుతుండగా…. ముద్రగడ పాడెను తన భుజాలపై మోసి ఆయన పట్ల తనకున్న అపారమైన గౌరవాన్ని, అనుబంధాన్ని చాటుకున్నారు. ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఇలా స్వయంగా పాడె మోయడం అక్కడికి వచ్చిన ప్రజలను, అభిమానులను కదిలించింది.

కాపు సామాజికవర్గ సంక్షేమం కోసం, వారి హక్కుల సాధన కోసం దశాబ్దాలుగా పోరాడిన నేతగా ముద్రగడ పద్మనాభంకు పేరుంది. నిఖార్సయిన వ్యక్తిత్వానికి, రాజీపడని పోరాట పటిమకు ఆయన నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. ఇటీవల కాలంలో ఆయన వైఎస్సార్‌సీపీ శ్రేణులతో కలిసి నడిచారు. ఆయన మృతితో ఒక బలమైన ప్రజా నాయకుడిని కోల్పోయామని పార్టీ వర్గాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ అంతిమయాత్రకు పార్టీ శ్రేణులతో పాటు వేలాది మంది అభిమానులు, స్థానికులు తరలివచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు.

ముద్రగడ కుటుంబ సభ్యులతో మాజీ సీఎం వైఎస్ జగన్

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe