
నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా మీరు మీ పిల్లలతో తప్పక చూడాల్సిన 7 సినిమాల పేర్లను మేము మీకు చెబుతున్నాము. ఈ చిత్రాలు IMDbలో మంచి రేటింగ్ సాధించుకున్నాయి. ఈ సినిమాలను ఏ ఓటీటీలో చూడొచ్చో ఇక్కడ తెలుసుకోండి.
2007లో అమీర్ ఖాన్ నటించిన తారే జమీన్ పర్ ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి చూడాల్సిన సినిమా. ఈ సినిమాలో చాలా సీరియస్ మెసేజ్ దాగి ఉంది. ఈ చిత్రానికి IMDb రేటింగ్ 8.3 ఉంది. యూట్యూబ్‌లో అద్దెకు తీసుకుని ఈ సినిమా చూడొచ్చు.
2011లో వచ్చిన స్టాన్లీ కా డబ్బా చిత్రం మిమ్మల్ని నవ్వించి భావోద్వేగానికి గురిచేసే చిత్రం. నాలుగో తరగతి చదువుతున్న స్టాన్లీ (పార్థో గుప్టే) చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ఈ చిత్రానికి IMDb రేటింగ్ 7.8 ఉండగా.. యూట్యూబ్‌లో అద్దెకు తీసుకోవడం ద్వారా సినిమాను చూడవచ్చు. ఈ సినిమాకు పార్థో గుప్టే జాతీయ అవార్డు అందుకున్నారు.
ఈ జాబితాలో 2010లోని ఫ్యామిలీ డ్రామా చిత్రం బమ్ బమ్ బోలే మూవీ కూడా ఉంది. ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. 6.4 ఐఎమ్‌డీబీ రేటింగ్ ఉన్న ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో, యూట్యూబ్‌లో వీక్షించవచ్చు.
2011లో విడుదలైన చిల్లర్ పార్టీ సినిమా కూడా పిల్లలు చూసే బెస్ట్ మూవీ. ఈ సినిమా పిల్లలకు బలమైన సందేశాన్ని ఇస్తుంది. ఈ చిత్రానికి ఐఎండీబీ రేటింగ్ 7.5గా ఉంది. యూట్యూబ్‌లో ఈ సినిమాను ఉచితంగా చూడొచ్చు.
రాణి ముఖర్జీ నటించిన హిచ్కీ చిత్రం కూడా ఈ జాబితాలో ఉంది. ఈ చిత్రం టూరెట్ సిండ్రోమ్ ఆధారంగా తెరకెక్కింది. ఈ చిత్రానికి ఐఎండీబీ రేటింగ్ 7.5 ఉంది. యూట్యూబ్‌లో అద్దెకు తీసుకుని ఈ సినిమా చూడొచ్చు.
2015లో విడుదలైన ధనక్ చిత్రం సోదరుడు, సోదరి అనుబంధం ఆధారంగా ఉంటుంది. ఈ సినిమా మిమ్మల్ని ఎమోషనల్ చేస్తుంది. ఈ చిత్రానికి ఐఎండీబీ రేటింగ్ 7.8 ఉంది. యూట్యూబ్‌లో సినిమా చూడొచ్చు.
2014లో విడుదలైన హవా హవాయి సినిమాలో పార్థో గుప్తే, సాకిబ్ సలీమ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఐఎండీబీ రేటింగ్ 7.3 ఉంది. యూట్యూబ్‌లో అద్దెకు తీసుకుని సినిమా చూడొచ్చు.