...
...
Next Story

నెట్‌ఫ్లిక్స్‌లో ఇవాళ ట్రెండ్ అవుతున్న 10 సినిమాలు- ఏకంగా 7 తెలుగులోనే స్ట్రీమింగ్- మీరు చూశారా?

నేడు ఆదివారం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో అనేక రకాల సినిమాలు ట్రెండ్ అవుతున్నాయి. దక్షిణాది సినిమాలు మరింత బాగా ట్రెండ్ అవుతున్నాయి. కొన్ని ఇంగ్లీష్ చిత్రాలు కూడా టాప్ 10లో చోటు దక్కించుకున్నాయి. కానీ, వీటన్నింటిని దాటి చాలా కాలం నుంచి ఓ సినిమా టాప్‌లో కొనసాగుతోంది. ఆ టాప్ 10 ఓటీటీ సినిమాలపై లుక్కేద్దాం.

Published on: Nov 23, 2025, 13:37:34 IST
Advertisement
<p>నెట్‌ఫ్లిక్స్‌లో ఇవాళ (నవంబర్ 23) ట్రెండింగ్‌లో టాప్ 10 సినిమాలు ఉన్నాయి. అందులో ఏకంగా 7 సినిమాలు తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాగే, ఒక సినిమా చాలా కాలం నుంచి ఓటీటీ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. మరి ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం. </p>

నెట్‌ఫ్లిక్స్‌లో ఇవాళ (నవంబర్ 23) ట్రెండింగ్‌లో టాప్ 10 సినిమాలు ఉన్నాయి. అందులో ఏకంగా 7 సినిమాలు తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాగే, ఒక సినిమా చాలా కాలం నుంచి ఓటీటీ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. మరి ఆ సినిమాలు ఏంటో లుక్కేద్దాం.

అక్షయ్ కుమార్, అర్షద్ వార్సీ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'జాలీ ఎల్‌ఎల్‌బి 3' ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయింది. థియేటర్ ప్రేక్షకుల నుండి మిశ్రమ సమీక్షలు అందుకున్న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఇవాళ టాప్ 1 ప్లేసులో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో హుమా ఖురేషి, అమృతా రావు కూడా నటించారు.

చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా బైసన్ నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 2 స్థానంలో దూసుకుపోతోంది. తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాకు మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు.

నెట్‌ఫ్లిక్స్ లో కపూర్ కుటుంబంపై వచ్చిన సినిమా డైనింగ్ విత్ ది కపూర్స్. రాజ్ కపూర్ 100వ పుట్టినరోజును పురస్కరించుకుని డైనింగ్ విత్ ది కపూర్స్ అనే టైటిల్‌తో వచ్చిన ఈ తెలుగు స్ట్రీమింగ్ మూవీలో కపూర్లందరినీ చూపించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా 3వ స్థానంలో ట్రెండ్ అవుతోంది.

డ్యూడ్ ఒక తమిళ రొమాంటిక్ చిత్రం. థియేటర్ తర్వాత ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చి 4వ స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా నటించారు. తెలుగులోనూ డ్యూడ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

ఇషాన్ ఖట్టర్, జాన్వీ కపూర్, విశాల్ జెత్వా కాంబినేషన్ లో తెరకెక్కిన 'హోమ్ బౌండ్' నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. ఈ చిత్రానికి నీరజ్ ఘైవాన్ దర్శకత్వం వహించారు. నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా 5వ స్థానంలో ట్రెండ్ అవుతోంది.

తెలుగు రొమాంటిక్ సినిమా తెలుసు కదాలో సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి ముఖ్య పాత్రలు పోషించారు. నెట్ ఫ్లిక్స్ లో ఈ చిత్రం 6వ స్థానంలో ట్రెండ్ అవుతోంది.

ధనుష్, నిత్య మీనన్ జంటగా నటించిన ఇడ్లీ కడై ఒక తమిళ డ్రామా చిత్రం. ఈ చిత్రం కథ ఇడ్లీ షాప్ ఆధారంగా ఉంటుంది. ఈ చిత్రంలో నటనతో పాటు ధనుష్ దర్శకత్వం కూడా వహించాడు. తెలుగులో ఇడ్లీ కొట్టుగా వచ్చిన ఈ సినిమా 7వ స్థానంలో నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్ లో ఉంది.

నెట్ ఫ్లిక్స్ లో 8వ స్థానంలో ట్రెండ్ అవుతున్న చిత్రం బారాముల్లా ప్రేక్షకులకు నచ్చింది. ఓ పోలీస్ ఆఫీసర్, చిన్నారి కిడ్నాప్ కు సంబంధించిన కథ ఈ సినిమా. చాలా కాలంగా ఈ సినిమా ఓటీటీలో దూసుకుపోతున్న ఈ సినిమా తెలుగులోనూ ఉంది.

ఈ నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 జాబితాలో ఫ్రాంకెన్ స్టైయిన్ 9వ స్థానంలో ఉంది. ఇది హారర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

బ్యూటిఫుల్ హీరోయిన్ దివ్య ఖోస్లా నటించిన సినిమా ఏక్ చతుర్‌నార్. ఒక మహిళ దొంగతనం చేసే డ్రామాగా వచ్చిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ట్రెండింగ్‌లో పదో స్థానంలో నిలిచింది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe