...
...
Next Story

ఫేక్ ఫాస్టాగ్ వెబ్‌సైట్లపై అప్రమత్తం- హైవే యూజర్లకు కీలక హెచ్చరిక!

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. 'ఫాస్టాగ్ యాన్యువల్ పాస్' పేరుతో నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి, అమాయక ప్రజలను మోసం చేస్తున్నట్లు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్​హెచ్​ఏఐ) గుర్తించింది. ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది.

Published on: Feb 17, 2026, 12:20:28 IST
Advertisement
<p>కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని 'ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్' ద్వారా ఈ హెచ్చరికను జారీ చేసింది. సెర్చ్ ఇంజన్లు, ఆన్‌లైన్ ప్రకటనల ద్వారా స్కామర్లు అధికారిక వెబ్‌సైట్లను పోలిన పోర్టల్స్‌తో మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు వెల్లడించారు</p>

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని 'ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్' ద్వారా ఈ హెచ్చరికను జారీ చేసింది. సెర్చ్ ఇంజన్లు, ఆన్‌లైన్ ప్రకటనల ద్వారా స్కామర్లు అధికారిక వెబ్‌సైట్లను పోలిన పోర్టల్స్‌తో మోసాలకు పాల్పడుతున్నట్లు అధికారులు వెల్లడించారు

ఈ మోసం ఎలా జరుగుతోంది? సైబర్ నేరగాళ్లు అత్యంత చాకచక్యంగా ఈ స్కామ్‌ను నిర్వహిస్తున్నారు. ఎన్​హెచ్​ఏఐ అధికారిక వెబ్‌సైట్లను అచ్చుగుద్దినట్లు పోలి ఉండే వెబ్‌సైట్లను వీరు సృష్టిస్తారు. గూగుల్ వంటి సెర్చ్ ఇంజన్లలో పెయిడ్ అడ్వర్టైజ్‌మెంట్స్, ఎస్​ఈఓ టెక్నిక్స్ ఉపయోగించి, యూజర్లు వెతికినప్పుడు తమ నకిలీ లింకులు పైన కనిపించేలా చేస్తారు.

ఈ మోసం ఎలా జరుగుతోంది? యూజర్లు ఆ లింక్ క్లిక్ చేయగానే మొబైల్ నంబర్, వాహన రిజిస్ట్రేషన్ వివరాలు, పేమెంట్ సమాచారం అడుగుతారు. అక్కడ ఉండే పేమెంట్ గేట్‌వే అచ్చం నిజమైన దానిలాగే కనిపిస్తుంది. కానీ, మీరు చేసే చెల్లింపు నేరుగా నేరగాళ్ల ఖాతాల్లోకి చేరుతుంది. డబ్బు కట్ అయిన తర్వాత ఎటువంటి కన్ఫర్మేషన్ రాదు, పైగా ఆ వెబ్‌సైట్లు కొద్దిసేపటికే మాయమైపోతాయి.

యూజర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు- ఫాస్టాగ్ సేవలను కేవలం అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్లు, ధృవీకరించిన బ్యాంకులు లేదా పేమెంట్ యాప్స్ ద్వారానే పొందాలి. ఏదైనా వెబ్‌సైట్ ఓపెన్ చేసినప్పుడు దాని యూఆర్​ఎల్​ అడ్రస్‌ను క్షుణ్ణంగా పరిశీలించండి. స్పాన్సర్డ్ లింక్స్ లేదా గుర్తుతెలియని యాడ్స్ క్లిక్ చేయవద్దు.

యూజర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు- టెక్నికల్ సపోర్ట్ పేరుతో ఎవరైనా ఫోన్ చేసినా లేదా వెబ్‌సైట్లలో అడిగినా.. ఓటీపీలు, కార్డు వివరాలు, పిన్ నంబర్లు ఎవరికీ చెప్పకండి. ఏదైనా వెబ్‌సైట్ అసాధారణ పర్మిషన్లు అడిగినా లేదా అనుమానాస్పదంగా కనిపించినా వెంటనే ఆ సైట్ నుంచి బయటకు వచ్చేయండి.

నిజమైన ఫాస్టాగ్ సేవలు కేవలం అధీకృత బ్యాంకులు, అధికారిక ఎన్​హెచ్​ఏఐ ఛానెళ్ల ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. సైబర్ నేరగాళ్ల బారిన పడి ఆర్థికంగా నష్టపోవద్దని వాహనదారులకు విజ్ఞప్తి చేశారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe