...
...
Next Story

OnePlus Ace 6 Ultra : 8600ఎంఏహెచ్​ బ్యాటరీతో వన్​ప్లస్ ఏస్ 6 అల్ట్రా.. ఫీచర్లు అరాచకం!

OnePlus new smartphone : స్మార్ట్‌ఫోన్ ప్రియులు షాక్ అయ్యేలా వన్‌ప్లస్ తన సరికొత్త 'ఏస్ 6 అల్ట్రా'ను చైనాలో విడుదల చేసింది. భారీ బ్యాటరీ, సూపర్ ఫాస్ట్ డిస్‌ప్లేతో వచ్చిన ఈ మొబైల్ గేమింగ్ లవర్స్‌కు పూనకాలు తెప్పించడం ఖాయం. ఫీచర్స్​ గురించి ఇక్కడ తెలుసుకోండి..

Published on: Apr 29, 2026, 11:18:42 IST
Advertisement
<p>వన్‌ప్లస్ నుంచి ఏదైనా కొత్త ఫోన్ వస్తుందంటేనే మార్కెట్​లో ఒక రేంజ్ అంచనాలు ఉంటాయి. కానీ ఈసారి ఆ అంచనాలను మించిపోయేలా ‘వన్‌ప్లస్ ఏస్ 6 అల్ట్రా’ని కంపెనీ చైనాలో లాంచ్ చేసింది. ఇప్పటికే ఏస్ 6, ఏస్ 6టీ మోడళ్లతో హల్చల్ చేస్తున్న ఈ సిరీస్‌లో.. 'అల్ట్రా' వెర్షన్ ఇప్పుడు పర్ఫార్మెన్స్‌కు కొత్త నిర్వచనం చెబుతోంది. ముఖ్యంగా గంటల తరబడి మొబైల్ వాడే యువతకు, ఛార్జింగ్ సమస్య లేకుండా ఉండాలంటే ఇలాంటి భారీ బ్యాటరీ ఫోన్ ఖచ్చితంగా కావాల్సిందే.</p>

వన్‌ప్లస్ నుంచి ఏదైనా కొత్త ఫోన్ వస్తుందంటేనే మార్కెట్​లో ఒక రేంజ్ అంచనాలు ఉంటాయి. కానీ ఈసారి ఆ అంచనాలను మించిపోయేలా ‘వన్‌ప్లస్ ఏస్ 6 అల్ట్రా’ని కంపెనీ చైనాలో లాంచ్ చేసింది. ఇప్పటికే ఏస్ 6, ఏస్ 6టీ మోడళ్లతో హల్చల్ చేస్తున్న ఈ సిరీస్‌లో.. 'అల్ట్రా' వెర్షన్ ఇప్పుడు పర్ఫార్మెన్స్‌కు కొత్త నిర్వచనం చెబుతోంది. ముఖ్యంగా గంటల తరబడి మొబైల్ వాడే యువతకు, ఛార్జింగ్ సమస్య లేకుండా ఉండాలంటే ఇలాంటి భారీ బ్యాటరీ ఫోన్ ఖచ్చితంగా కావాల్సిందే.

ఈ స్మార్ట్​ఫోన్ చూడటానికి ఎంత స్టైలిష్‌గా ఉందో, వాడేటప్పుడు అంత స్మూత్‌గా ఉంటుంది. ఇందులో 6.78 ఇంచ్​ 1.5కే రిజల్యూషన్ కలిగిన అమోలెడ్ స్క్రీన్‌ను అమర్చారు. సాధారణంగా మనం వాడే ఫోన్లలో 60హెచ్​జెడ్ లేదా 120హెచ్​జెడ్ ఉంటుంది. కానీ ఇందులో ఏకంగా 165హెచ్​జెడ్ రిఫ్రెష్ రేట్ ఇచ్చారు. అంటే గేమింగ్ ఆడేటప్పుడు బొమ్మ కదిలినట్లు కాకుండా అత్యంత వేగంగా స్పందిస్తుంది. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 1,800 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌ను అందించారు.

ఈ మొబైల్ లోపల మీడియాటెక్ నుంచి వచ్చిన అత్యంత వేగవంతమైన 'డైమెన్సిటీ 9500' చిప్‌సెట్ ఉంది. దీని గరిష్ట వేగం 4.21జీహెచ్​జెడ్ వరకు ఉంటుంది. మల్టీ టాస్కింగ్ కోసం 16జీబీ వరకు ర్యామ్, స్టోరేజ్ కోసం ఏకంగా 1టీబీ వరకు ఆప్షన్లను ఇచ్చారు.

వన్​ప్లస్​ ఏస్​ 6 అల్ట్రా ఫోటోగ్రఫీ కోసం వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఇచ్చారు. 50ఎంపీ ప్రైమరీ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) సపోర్ట్‌తో వస్తుంది. దీనివల్ల ఫోటోలు అస్సలు షేక్ అవ్వవు. 8ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా.. గ్రూప్ ఫోటోలు, ప్రకృతి దృశ్యాలను బంధించడానికి ఉపయోగపడుతుంది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 16ఎంపీ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్‌తో 4కే వీడియోలను సెకనుకు 60 ఫ్రేముల వేగంతో రికార్డ్ చేయవచ్చు.

వన్‌ప్లస్ సంస్థ ఈ స్మార్ట్​ఫోన్​లో ఏకంగా 8600ఎంఏహెచ్ భారీ బ్యాటరీని ప్యాక్ చేసింది. దీనికి తోడు 120డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అంటే ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు మూడు రోజుల పాటు నిశ్చింతగా ఉండవచ్చు. ధరలు ఈ విధంగా ఉన్నాయి.. 12GB + 256GB: దాదాపు రూ. 48,400, 16GB + 512GB: దాదాపు రూ. 60,800, 16GB + 1TB: దాదాపు రూ. 70,500

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe