...
...
Next Story

పాపికొండల విహారయాత్రకు మళ్లీ బ్రేక్ - టూరిజం బోట్లు బంద్!

తుపాన్ ప్రభావంతో పాపికొండల విహారయాత్ర తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇవాళ్టి నుంచి బోట్ల రాకపోకలను నిలిపివేస్తూ రంపచోడవరం సబ్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

Published on: Oct 26, 2026, 06:51:45 IST
Advertisement
<p>అల్లూరి సీతారామరాజు జిల్లా పోలవరం ప్రాంతంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం పాపికొండల విహారయాత్రకు మళ్లీ విఘాతం ఏర్పడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాన్ ప్రభావం వల్ల నేటి(అక్టోబర్ 26, 2026) నుంచి పాపికొండలకు వెళ్లే టూరిజం బోట్ల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.</p><p> </p>

అల్లూరి సీతారామరాజు జిల్లా పోలవరం ప్రాంతంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం పాపికొండల విహారయాత్రకు మళ్లీ విఘాతం ఏర్పడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాన్ ప్రభావం వల్ల నేటి(అక్టోబర్ 26, 2026) నుంచి పాపికొండలకు వెళ్లే టూరిజం బోట్ల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని మొత్తం టూరిజం బోట్ల కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని రంపచోడవరం సబ్ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. నదిలో అలల తాకిడి పెరిగే అవకాశం ఉండటం, ఈదురుగాలుల తీవ్రత దృష్ట్యా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇటీవలే గోదావరి నదికి భారీగా వచ్చిన వరదల కారణంగా దాదాపు 70 రోజుల పాటు పాపికొండల విహారయాత్ర పూర్తిగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దసరా సెలవులను పురస్కరించుకుని, కేవలం రెండు వారాల క్రితమే అధికారులు ఈ యాత్రను పునఃప్రారంభించారు.

సుదీర్ఘ విరామం తర్వాత పర్యాటకులు ఇప్పుడిప్పుడే పాపికొండల అందాలను తిలకించేందుకు తరలివస్తున్న సమయంలో, మళ్లీ తుపాన్ రూపంలో విహారయాత్రకు విరామం పడటంతో పర్యాటకులు, స్థానిక బోటు నిర్వహకులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

వాతావరణం అనుకూలించి పరిస్థితి సాధారణ స్థితికి వచ్చాకే తిరిగి బోట్ల రాకపోకలను పునరుద్ధరిస్తామని టూరిజం యంత్రాంగం వెల్లడించింది. అప్పటివరకు రాకపోకలపై నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.

పాపికొండలు
 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks