...
...
Next Story

Peddi OTT : ఓటీటీలోకి వచ్చేసిన పెద్ది- ఎక్స్​ట్రా సీన్స్​తో! రామ్​చరణ్ సినిమా ఓవరాల్ కలెక్షన్లు ఎంత?

2026లో టాలీవుడ్​ బిగ్గెస్ట్​ రిలీజ్​లలో ఒకటైన పెద్ది సినిమా ఇప్పుడు.. నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. రామ్​చరణ్​ తేజ, జాన్వీ కపూర్​ నటించిన ఈ సినిమా నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమ్ అవుతోంది. ఈ నేపథ్యంలో పెద్ది ఓవరాల్ కలెక్షన్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jul 9, 2026, 11:51:01 IST
Advertisement
<p>విజయనగరం బ్యాక్​డ్రాప్​లో ఓ యువకుడి పోరాటానికి సంబంధించిన కథే ఈ పెద్ది. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అద్భుత నటనకు గాను మెగా పవర్​ స్టార్ రామ్​చరణ్​ తేజ మంచి ప్రసంశలు అందుకున్నారు.</p>

విజయనగరం బ్యాక్​డ్రాప్​లో ఓ యువకుడి పోరాటానికి సంబంధించిన కథే ఈ పెద్ది. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అద్భుత నటనకు గాను మెగా పవర్​ స్టార్ రామ్​చరణ్​ తేజ మంచి ప్రసంశలు అందుకున్నారు.

నెట్​ఫ్లిక్స్​లో ప్రస్తుతం ఈ సినిమా స్ట్రీమ్ అవుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో మీరు ఈ పెద్ది సినిమాని చూడవచ్చు. అయితే, థియేటర్​ కట్​ కంటే ఓటీటీ కట్​ కాస్త ఎక్కువగా ఉంది. థియేటర్​ వర్షెన్​లో లేని కొన్ని సీన్లు, ఓటీటీ వర్షెన్​లో యాడ్​ చేశారు.

పలు నివేదికల ప్రకారం పెద్ది వరల్డ్​ వైడ్​ గ్రాస్ రూ. 333కోట్లుగా ఉంది. ఒక్క మన దేశంలోనే గ్రాస్​ రూ. 282కోట్లుగా ఉంది. ఓవర్సీస్ మార్కెట్​ నుంచి రూ. 51కోట్లు రాబట్టింది.

టాలివుడ్​లోనే 11వ హయ్యెస్ట్​ గ్రాసింగ్​ సినిమాగా పెద్ది నిలిచింది. హిందీ వర్షెన్​కి ఆశించిన మేర వసూళ్లు రాకపోయినా.. తెలుగు రాష్ట్రాల కలెక్షన్లు చూస్తే మాత్రం.. పెద్ది సినిమా బ్లాక్​బస్టర్​ అనే చెప్పాలి.

ఇక నెట్​ఫ్లిక్స్​.. ఈ పెద్ది సినిమా ఓటీటీ రైట్స్ కోసం రూ. 105 కోట్ల నుంచి రూ. 130 కోట్ల వరకు వెచ్చించినట్టు సమాచారం.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe