...
...
Next Story

ఫొటోలు : పవన్ కళ్యాణ్ నివాసానికి ప్రధాని మోదీ - జనసేనానికి పరామర్శ..!

PM Modi visit Pawan residence : ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెళ్లారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై ఆరా తీసి ఆయనను పరామర్శించారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు ఇంటికెళ్లారు.

Published on: May 10, 2026 07:58 PM IST
Advertisement
<p>ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెళ్లారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై ఆరా తీసి ఆయనను పరామర్శించారు. </p>

ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నివాసానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెళ్లారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై ఆరా తీసి ఆయనను పరామర్శించారు.

పవన్ కళ్యాణ్ ఇంటికి చేరుకున్న ప్రధాని మోదీకి జనసేనాని సాదరంగా స్వాగతం పలికారు. కొద్దిసేపు పవన్ కళ్యాణ్‌తో ఏకాంతంగా గడిపిన ప్రధాని, ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ప్రధాని మోదీ… తన సంఘీభావాన్ని తెలియజేశారు.

ఇటీవలే పవన్ కల్యాణ్ కు సర్జరీ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ… పవన్ ఇంటికి వెళ్లి పరామర్శించారు.

హైదరాబాద్ పర్యటనలో భాగంగానే…. ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లారు.

తన నివాసానికి వచ్చిన ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు స్వాగతం పలికారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe