...
...
Next Story

Poco C81 pro : రూ. 8300కే 6000ఎంఏహెచ్​ బ్యాటరీ స్మార్ట్​ఫోన్- పోకో కొత్త గ్యాడ్జెట్​ హైలైట్స్​ ఇవే..

Budget Smartphone : బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్ కొనేవారి కోసం పోకో సంస్థ మరో ఆకర్షణీయమైన మొబైల్‌ను విడుదల చేసింది. భారీ బ్యాటరీ, అదిరిపోయే డిస్‌ప్లే ఫీచర్లతో వచ్చిన ఈ 'పోకో సీ81 ప్రో' విశేషాలు ఇక్కడ తెలుసుకోండి..

Published on: Apr 28, 2026, 11:24:50 IST
Advertisement
<p>భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోని బడ్జెట్ విభాగంలో గట్టి పోటీనిచ్చే పోకో, అంతర్జాతీయంగా తన క్రేజీ మోడల్ 'పోకో సీ81 ప్రో'ని ఆవిష్కరించింది. వాల్యూ ఫర్​ మనీ అందించే లక్ష్యంతో వచ్చిన ఈ ఫోన్, ముఖ్యంగా విద్యార్థులు, సాధారణ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేసినట్లు కనిపిస్తోంది. భారీ స్క్రీన్, రోజంతా ఛార్జింగ్ అవసరం లేని బ్యాటరీ దీని ప్రధాన ఆకర్షణలు.</p>

భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోని బడ్జెట్ విభాగంలో గట్టి పోటీనిచ్చే పోకో, అంతర్జాతీయంగా తన క్రేజీ మోడల్ 'పోకో సీ81 ప్రో'ని ఆవిష్కరించింది. వాల్యూ ఫర్​ మనీ అందించే లక్ష్యంతో వచ్చిన ఈ ఫోన్, ముఖ్యంగా విద్యార్థులు, సాధారణ వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేసినట్లు కనిపిస్తోంది. భారీ స్క్రీన్, రోజంతా ఛార్జింగ్ అవసరం లేని బ్యాటరీ దీని ప్రధాన ఆకర్షణలు.

పోకో సి81 ప్రోలో 6.9 ఇంచ్ భారీ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ ప్యానెల్‌ను అమర్చారు. సాధారణంగా ఈ ధరలో 90హెచ్​జెడ్ రిఫ్రెష్ రేట్ ఇస్తుంటారు, కానీ పోకో ఏకంగా 120హెచ్​జెడ్ రిఫ్రెష్ రేట్‌ను అందించి ఆశ్చర్యపరిచింది. దీనివల్ల ఫోన్ స్క్రోలింగ్, గేమింగ్ చాలా సాఫీగా సాగుతాయి. ఈ డిస్‌ప్లేకు ట్రిపుల్ TÜV Rheinland సర్టిఫికేషన్ ఉంది. అంటే, ఎక్కువ సేపు ఫోన్ చూసినా కళ్లపై ఒత్తిడి పడదు. 800 నిట్స్ పీక్ బ్రెయిట్‌నెస్ ఉండటం వల్ల ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది..

ఈ హ్యాండ్‌సెట్ యూనిఎస్​ఓసీ టీ7250 ఆక్టా-కోర్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఇందులో 4GB LPDDR4x ర్యామ్‌ను అందించారు. వినూత్నమైన 'వర్చువల్ ర్యామ్' టెక్నాలజీ ద్వారా దీనిని మరో 8జీబీ వరకు పెంచుకోవచ్చు. అంటే మొత్తంగా 12జీబీ వరకు ర్యామ్ పర్ఫార్మెన్స్‌ను పొందవచ్చు. స్టోరేజ్ పరంగా 64జీబీ, 128జీబీ, 256జీబీ వేరియంట్లలో ఈ ఫోన్ లభ్యమవుతుంది. మైక్రో ఎస్‌డీ కార్డ్ ద్వారా మెమరీని మరింత పెంచుకునే వెసులుబాటు ఉంది. ఇది లేటెస్ట్ హైపర్ ఓఎస్ 3పై నడుస్తుంది.

సాధారణంగా ఫోన్లలో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. కానీ పోకో సి81 ప్రోలో ఏకంగా 6,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 79 గంటల పాటు మ్యూజిక్ ప్లేబ్యాక్ వస్తుందని కంపెనీ చెబుతోంది. దీనికి 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఫోన్ భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లను అందించారు. కెమెరాల విషయానికి వస్తే, వెనుకవైపు 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, ముందు భాగంలో సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ షూటర్ ఉన్నాయి.

ప్రస్తుతం ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్కెట్లలో విడుదలైన ఈ ఫోన్ ధరలు ఇలా ఉన్నాయి: 4GB + 64GB: 99 డాలర్లు (సుమారు రూ. 8,300), 4GB + 128GB: 109 డాలర్లు (సుమారు రూ. 9,100), 4GB + 256GB: 129 డాలర్లు (సుమారు రూ. 10,800). బ్లాక్, గోల్డ్, గ్రీన్ రంగుల్లో లభించే ఈ ఫోన్ భారత్‌లో ఎప్పుడు లాంచ్ అవుతుందనే దానిపై పోకో ఇండియా నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe