...
...
Next Story

Priyansh Arya: ఇదెక్కడి మాస్ బ్యాటింగ్ మామా! టీ20లో 68 బాల్స్ లో 181.. 19 సిక్సర్లు.. ప్రియాన్ష్ ఆర్య రికార్డుల మోత!

Priyansh Arya: ఇదెక్కడి మాస్ బ్యాటింగ్ మామా.. ఇదేం బాదుడు సామి.. మంగళవారం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మ్యాచ్ లో ప్రియాన్ష్ ఆర్య బ్యాటింగ్ చూసిన తర్వాత ఇలా అనుకోవాల్సిందే. ఈ యంగ్ ఓపెనర్ కేవలం 68 బంతుల్లోనే 181 పరుగులు చేశాడు. రికార్డుల మోత మోగించాడు. అతను నమోదు చేసిన రికార్డులపై ఓ లుక్కేయండి.

Published on: Nov 24, 2026, 13:20:36 IST
Advertisement
<p>యంగ్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య ఇరగదీశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తమిళనాడుతో మ్యాచ్ లో ఈ ఢిల్లీ ఓపెనర్ 68 బాల్స్ లో ఏకంగా 181 రన్స్ కొట్టాడు. టీ20ల్లో అత్యధిక స్కోరు చేసిన ఇండియన్ బ్యాటర్ గా రికార్డు నమోదు చేశాడు. </p>

యంగ్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య ఇరగదీశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తమిళనాడుతో మ్యాచ్ లో ఈ ఢిల్లీ ఓపెనర్ 68 బాల్స్ లో ఏకంగా 181 రన్స్ కొట్టాడు. టీ20ల్లో అత్యధిక స్కోరు చేసిన ఇండియన్ బ్యాటర్ గా రికార్డు నమోదు చేశాడు.

ఇండియన్ బ్యాటర్లలో పురుషుల క్రికెట్లో కేఎల్ రాహుల్ (152), ఓవరాల్ గా కిరణ్ నవగిరె (162) రికార్డును ప్రియాన్ష్ ఆర్య బ్రేక్ చేశాడు. ప్రపంచ టీ20 క్రికెట్లో అత్యధిక స్కోరు చేసిన రెండో బ్యాటర్ గా ప్రియాన్ష్ నిలిచాడు. టాప్ లో దక్షిణాఫ్రికా ఆటగాడు ప్రిటోరియస్ (188 నాటౌట్) ఉన్నాడు.

ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ కు ఆడే ప్రియాన్ష్ ఈ 181 రన్స్ ఇన్నింగ్స్ లో ఏకంగా 19 సిక్సర్లు కొట్టాడు. ఓ టీ20 ఇన్నింగ్స్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్లలో టాప్ లో ఉన్న ఫిన్ అలెన్ సరసన ప్రియాన్ష్ చేరాడు.

ప్రియాన్ష్ ఆర్య విధ్వంసంతో ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 275 రన్స్ చేసింది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఇది మూడో అత్యధిక స్కోరు.

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఢిల్లీ కెప్టెన్ అయిన ప్రియాన్ష్ ఆర్య సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఈ మ్యాచ్ కు ముందు ఈ టోర్నీలో రెండు హాఫ్ సెంచరీలు చేశాడు.

 

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks