...
...
Next Story

ఏపీ, తెలంగాణ వెదర్ అప్డేట్ - ఇవాళ పలుచోట్ల వర్షాలు..! ఐఎండీ అంచనాలివే

ద్రోణి ప్రభావంతో నేడు ఆంధ్రప్రదేశ్‌లోని 14 జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. అటు తెలంగాణలోనూ ఇవాళ, రేపు ఉరుములతో కూడిన వానలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Published on: Nov 25, 2026, 09:40:26 IST
Advertisement
<p>తెలుగు రాష్ట్రాల వాతావరణంలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకున్నాయి. ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఇవాళ (నవంబర్ 25, బుధవారం) వర్షాలు కురిసే అవకాశం ఉంది, </p>

తెలుగు రాష్ట్రాల వాతావరణంలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకున్నాయి. ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఇవాళ (నవంబర్ 25, బుధవారం) వర్షాలు కురిసే అవకాశం ఉంది,

ద్రోణి ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వాతావరణం మేఘావృతమై వర్షాలు కురవనున్నాయి. ప్రధానంగా మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఏపీలోని 14 జిల్లాలతో పాటు రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురు జల్లులు పడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోనూ రాబోయే రెండు రోజుల పాటు వర్ష సూచన ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం మంగళవారం సాయంత్రం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నవంబర్ 26 ఉదయం 8:30 గంటల వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది.

అయితే తెలంగాణలో భారీ వర్షాలు, పిడుగుల వంటి తీవ్ర హెచ్చరికలు (Warnings) ఏవీ లేవని ఐఎండీ అధికారులు స్పష్టం చేశారు.

నవంబర్ 26 ఉదయం నుంచి నవంబర్ 30 వరకు తెలంగాణ వ్యాప్తంగా పూర్తిగా పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకస్మిక జల్లుల నేపథ్యంలో కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడవకుండా రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

 

ABOUT THE AUTHOR

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks