
శివగామి రమ్యకృష్ణ మరోసారి బిగ్ బాస్ హోస్ట్ అవతారమెత్తారు. బిగ్ బాస్ తమిళ్ 10వ సీజన్ లో తాజా వీకెండ్ లో తన హోస్టింగ్ తో ఆమె అదరగొట్టారు.
బిగ్ బాస్ తమిళ్ 10వ సీజన్ కు విజయ్ సేతుపతి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే గొంతు నొప్పి కారణంగా ఆయన షోకు దూరమయ్యారని తెలిసింది.
విజయ్ సేతుపతి విశ్రాంతి తీసుకుంటుండటంతో శివగామి రమ్యకృష్ణ రంగంలోకి దిగారు. తాజాగా వీకెండ్ ఎపిసోడ్ లో తన హోస్టింగ్ కంటెస్టెంట్లను ఓ ఆటాడుకున్నారు.
రమ్యకృష్ణ గతంలోనూ బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరించారు. తెలుగులో బిగ్ బాస్ సీజన్ 3లో ఒక వీకెండ్ లో ఆమె కనిపించారు. ఇక తమిళ్ బిగ్ బాస్ సీజన్ 5లో అప్పటి హోస్ట్ కమల్ హాసన్ హెల్త్ బాలేకపోతే రమ్యకృష్ణనే ఆ బాధ్యతలు తీసుకున్నారు.
తాజాగా బిగ్ బాస్ హోస్ట్ గా వచ్చిన రమ్యకృష్ణ రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఒక్క రోజుకు రూ.15 లక్షలు తీసుకుంటున్నారని టాక్. అంటే వీకెండ్ ఎపిసోడ్ల కోసం రెండు రోజులకు కలిపి రూ.30 లక్షలు ఖాతాలో వేసుకుంటున్నారని సమాచారం.