...
...
Next Story

కోనసీమ మత్స్యకారులకు అండగా రిలయన్స్ ఫౌండేషన్ - పడవల పునరుద్ధరణకు సహాయక చర్యలు ప్రారంభం

"అర్నవ్" తుఫానుతో కోనసీమ జిల్లాలో కొట్టుకుపోయిన 180కి పైగా పడవలను వెలికితీసేందుకు రిలయన్స్ ఫౌండేషన్ భారీ సహాయక చర్యలు చేపట్టింది. 10,000 మంది మత్స్యకారుల జీవనోపాధిని పునరుద్ధరించడమే లక్ష్యంగా భారీ క్రేన్లతో పడవల వెలికితీత కొనసాగుతోంది.

Published on: Nov 6, 2026, 17:51:47 IST
Advertisement
<p>'అర్నవ్ ' తుఫాను ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరప్రాంతాల్లో తీవ్ర విధ్వంసాన్ని మిగిల్చింది. ప్రధానంగా డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మత్స్యకార సముదాయాల జీవనోపాధిపై ఈ తుఫాను దెబ్బకొట్టింది. వేలాది కుటుంబాలు తమ దైనందిన జీవితాన్ని కోల్పోయి తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు చేయూతనందించేందుకు రిలయన్స్ ఫౌండేషన్ తక్షణమే రంగానికి దిగింది. తుఫాను ధాటికి కొట్టుకుపోయిన, మునిగిపోయిన మత్స్యకారుల యాంత్రిక పడవలను తిరిగి వెలికితీసి, వారి జీవనోపాధిని పునరుద్ధరించేందుకు బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించింది.</p><p> </p>

'అర్నవ్ ' తుఫాను ఆంధ్రప్రదేశ్ తూర్పు తీరప్రాంతాల్లో తీవ్ర విధ్వంసాన్ని మిగిల్చింది. ప్రధానంగా డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మత్స్యకార సముదాయాల జీవనోపాధిపై ఈ తుఫాను దెబ్బకొట్టింది. వేలాది కుటుంబాలు తమ దైనందిన జీవితాన్ని కోల్పోయి తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు చేయూతనందించేందుకు రిలయన్స్ ఫౌండేషన్ తక్షణమే రంగానికి దిగింది. తుఫాను ధాటికి కొట్టుకుపోయిన, మునిగిపోయిన మత్స్యకారుల యాంత్రిక పడవలను తిరిగి వెలికితీసి, వారి జీవనోపాధిని పునరుద్ధరించేందుకు బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించింది.

కోనసీమ జిల్లా అల్లావరం మండలంలోని ఓడలరేవు, సఖినేటిపల్లి ఫిషింగ్ ల్యాండింగ్ కేంద్రాల్లో తుఫాను ప్రభావంతో…. లంగరు వేసిన స్థానాల నుండి దాదాపు 186 చేపల వేట పడవలు కొట్టుకుపోయాయి. సుమారు 5 నుండి 10 టన్నుల బరువున్న ఈ పడవలు సమీపంలోని కాలువలు, బురద ప్రాంతాలు, ఒండ్రు దిబ్బలలో చిక్కుకుపోయాయి. కొన్ని పడవలు ఒకదానిపై ఒకటి పడిపోగా, మరికొన్ని పాక్షికంగా లేదా పూర్తిగా మునిగిపోయాయి.రహదారులు సరిగ్గా లేని, దట్టమైన బురద పేరుకుపోయిన ప్రమాదకర ప్రాంతాలలో పడవలు ఇరుక్కుపోవడంతో, వాటిని చేతులతో లేదా సాధారణ పద్ధతుల్లో వెలికితీయడం అసాధ్యంగా మారింది. రోజులు గడిచేకొద్దీ నీటిలోనే ఉన్న పడవలు మరింత దెబ్బతినే ప్రమాదం ఏర్పడింది.

క్షేత్రస్థాయిలో పరిస్థితి తీవ్రతను గుర్తించిన రిలయన్స్ ఫౌండేషన్ బృందాలు…. సంస్థ యొక్క "వి కేర్" (We Care) సామాజిక బాధ్యత సూత్రానికి అనుగుణంగా తక్షణమే స్పందించాయి. అల్లావరం మండల మత్స్యశాఖ, స్థానిక ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని భారీ యంత్రాల సహాయంతో వెలికితీత చర్యలను ప్లాన్ చేశాయి.

ప్రత్యేక క్రేన్లు, యాంత్రిక పరికరాలను రప్పించి, ప్రమాదకర పరిస్థితుల్లో ఇరుక్కుపోయిన పడవలను సురక్షిత ప్రాంతాలకు చేర్చే పనిని ప్రారంభించారు. స్థానిక మత్స్యకారులతో కలిసి ప్రతి పడవ లొకేషన్‌ను క్షుణ్ణంగా నిర్ధారించుకుంటూ, నిపుణులైన క్రేన్ ఆపరేటర్ల పర్యవేక్షణలో అత్యంత జాగ్రత్తగా ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నారు.

ఈ పునరుద్ధరణ చర్య ద్వారా ఈ ప్రాంతంలోని సుమారు 10,000 మంది మత్స్యకారులు నేరుగా, పరోక్షంగా ప్రయోజనం పొందనున్నారు. పడవలు నీటిలోనే ఉండిపోవడం వల్ల జరిగే అదనపు ఆర్థిక నష్టాన్ని ఈ చర్య నిరోధిస్తుంది. సురక్షితంగా బయటకు తీసిన పడవల మరమ్మతు అంచనాలను త్వరితగతిన పూర్తి చేసుకుని, మరమ్మతులు ముగిసిన వెంటనే మత్స్యకార కుటుంబాలు మళ్లీ వేటకు వెళ్లేలా రిలయన్స్ ఫౌండేషన్ బాటలు వేస్తోందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks