...
...
Next Story

Ruhani Sharma: ఆకాశంలో ఒక తార సినిమాలో బిజిలీ.. కనిపించింది కాసేపే..కానీ రుహానీ శర్మ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Ruhani Sharma: తెలుగు తెరపై హీరోయిన్ మెరిసిన రుహానీ శర్మ గుర్తుందా? తాజాగా ఆకాశంలో ఒక తార సినిమాలో ఆమె బిజిలీగా ఆకట్టుకుంది. చిన్నపాత్రే అయినా చాలా ఇష్టంతో చేసింది. ఈ మూవీ కోసం రుహానీ తీసుకున్న రెమ్యునరేషన్ తెలిస్తే మాత్రం షాక్ అవుతారు.

Published on: Nov 23, 2026, 17:53:33 IST
Advertisement
<p>ఆకాశంలో ఒక తార సినిమాలో బిజిలీగా మెరిసింది రుహానీ శర్మ. ఫస్టాఫ్ లో వచ్చే కీలక పాత్రలో ఈ భామ అదరగొట్టింది. </p>

ఆకాశంలో ఒక తార సినిమాలో బిజిలీగా మెరిసింది రుహానీ శర్మ. ఫస్టాఫ్ లో వచ్చే కీలక పాత్రలో ఈ భామ అదరగొట్టింది.

ఆకాశంలో ఒక తార సినిమాలో బిజిలీ అనే గుజరాతీ అమ్మాయిగా రుహానీ శర్మ నటించింది. హీరోకు హిందీ నేర్పిస్తుంది. అతనితో ప్రేమలో పడుతుంది. కానీ అప్పటికే తనకు పెళ్లి అయిందని హీరో చెప్తాడు.

హీరోపై ఆశలు పెంచుకునే బిజిలీగా రుహానీ చక్కగా నటించింది. ఆ తర్వాత అతనికి పెళ్లి అయిందని తెలిసిన తర్వాత కలిగే ఎమోషన్స్ ను కూడా చక్కగా పలికించింది.

ఈ సినిమాలో రుహానీ శర్మ కనిపించేది కాసేపే. కానీ అందు కోసం ఆమె ఏకంగా అరకోటి రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకుందని టాక్.

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి మరదలు వరుస అయ్యే రుహానీ శర్మ తెలుగులో చిలసౌ, హిట్ ది ఫస్ట్ కేస్, డర్టీ హరీ, నూటొక్క జిల్లాల అందగాడు, సైంధవ్ తదితర సినిమాల్లో నటించింది.

 

ABOUT THE AUTHOR

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks