...
...
Next Story

Sachin birthday : హ్యాపీ బర్త్‌డే సచిన్- 22 ఏళ్ల పాటు తగ్గని ఆకలి.. ఆ 100 సెంచరీలు ఊరికే రాలేదు!

సచిన్ టెండూల్కర్ నేడు 53వ పడిలోకి అడుగుపెట్టారు. క్రికెట్​ గాడ్ సాధించిన 100 అంతర్జాతీయ సెంచరీలను ప్రపంచం ఒక అంకెగా చూస్తుంది. కానీ, ఆ రికార్డు వెనుక ఉన్న అసలు కథ నిరంతర శ్రమ, మారుతున్న కాలానికి అనుగుణంగా తనను తాను మార్చుకున్న వైనం. దీనిపై ఒక లోతైన విశ్లేషణ..

Published on: Apr 24, 2026, 09:58:09 IST
Advertisement
<p>క్రికెట్ ప్రపంచంలో సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలు అనేది ఒక అద్భుతమైన స్మారక చిహ్నంలా మిగిలిపోయింది. అయితే, ఆ చిహ్నాన్ని దగ్గరగా పరిశీలిస్తే.. అది కేవలం ఒక రౌండ్ ఫిగర్ మాత్రమే కాదు, 21 ఏళ్ల 7 నెలల 7 రోజుల సుదీర్ఘ పోరాటం అని అర్థమవుతుంది. 1990 ఆగస్టులో ఇంగ్లాండ్‌పై తొలి సెంచరీ చేసిన సచిన్, 2012 మార్చిలో బంగ్లాదేశ్‌పై తన వందో సెంచరీ పూర్తి చేశారు. ఈ రెండు దశాబ్దాల ప్రయాణంలో సచిన్ కేవలం పరుగులు తీయలేదు, మారుతున్న క్రికెట్ యుగాలకు అనుగుణంగా తన బ్యాటింగ్‌ను మలచుకున్నారు.</p>

క్రికెట్ ప్రపంచంలో సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలు అనేది ఒక అద్భుతమైన స్మారక చిహ్నంలా మిగిలిపోయింది. అయితే, ఆ చిహ్నాన్ని దగ్గరగా పరిశీలిస్తే.. అది కేవలం ఒక రౌండ్ ఫిగర్ మాత్రమే కాదు, 21 ఏళ్ల 7 నెలల 7 రోజుల సుదీర్ఘ పోరాటం అని అర్థమవుతుంది. 1990 ఆగస్టులో ఇంగ్లాండ్‌పై తొలి సెంచరీ చేసిన సచిన్, 2012 మార్చిలో బంగ్లాదేశ్‌పై తన వందో సెంచరీ పూర్తి చేశారు. ఈ రెండు దశాబ్దాల ప్రయాణంలో సచిన్ కేవలం పరుగులు తీయలేదు, మారుతున్న క్రికెట్ యుగాలకు అనుగుణంగా తన బ్యాటింగ్‌ను మలచుకున్నారు.

చాలా మంది బ్యాటర్లు తమ 30 ఏళ్ల వయసు దాటాక కెరీర్ ముగింపు గురించి ఆలోచిస్తారు. కానీ సచిన్ విషయంలో గణాంకాలు ఆశ్చర్యపరుస్తాయి. 20 ఏళ్ల లోపే 5 సెంచరీలు, 25 నుంచి 29 ఏళ్ల మధ్య ఏకంగా 35 సెంచరీలు సాధించి పరుగుల పంట పండించారు. 35 ఏళ్లు దాటిన తర్వాత సచిన్ సాధించిన 19 సెంచరీలు ఆయనలోని పట్టుదలకు నిదర్శనం! సామాన్యంగా బ్యాటర్ల రిఫ్లెక్స్‌లు తగ్గిపోయే ఆ వయసులో కూడా ఆయన తన టెక్నిక్‌ను మార్చుకుంటూ సెంచరీల వేట కొనసాగించారు.

సచిన్ తన వన్డే కెరీర్‌ను 1989లో ప్రారంభించినా, మొదటి సెంచరీ కోసం ఐదేళ్లు వేచి చూడాల్సి వచ్చింది. 1994 సెప్టెంబర్‌లో ఆయన ఓపెనర్‌గా రావడం మొదలుపెట్టిన తర్వాతే వన్డే క్రికెట్ రూపురేఖలు మారిపోయాయి. ఓపెనర్​గా ఆయన 344 ఇన్నింగ్స్‌ల్లో 15,310 పరుగులు, 45 సెంచరీలు చేశారు. మిగిలిన స్థానాల్లో 119 మ్యాచ్‌ల్లో కేవలం 4 సెంచరీలు. ఒక చిన్న వ్యూహాత్మక మార్పు ఒక సాధారణ కెరీర్‌ను ప్రపంచ రికార్డు స్థాయికి ఎలా తీసుకెళ్తుందో చెప్పడానికి ఇదొక నిదర్శనం.

ఏ బ్యాటర్ రికార్డునైనా తూచాల్సింది ప్రత్యర్థి బలాన్ని బట్టే. సచిన్ తన 100 సెంచరీలలో అత్యధికంగా 20 సెంచరీలు అప్పటి మేటి జట్టు ఆస్ట్రేలియాపైనే సాధించారు. శ్రీలంకపై 17, దక్షిణాఫ్రికాపై 12 సెంచరీలు చేయడం చూస్తుంటే, ఆయన తన రికార్డులను బలహీన జట్లపై కాకుండా, ప్రపంచ స్థాయి బౌలింగ్ అటాక్ ఉన్న జట్లపైనే నిర్మించుకున్నారని స్పష్టమవుతోంది.

సచిన్ సెంచరీలు వ్యక్తిగత రికార్డుల కోసమేననే విమర్శ ఒకటి తరచూ వినిపిస్తుంది. కానీ డేటా మరోలా ఉంది. ఆయన సెంచరీ చేసిన 100 మ్యాచ్‌లలో భారత్ 53 సార్లు విజయం సాధించింది. టెస్టుల్లో ఆయన సెంచరీ చేసిన 51 మ్యాచ్‌లలో భారత్ కేవలం 11 సార్లు మాత్రమే ఓడిపోయింది. అంటే ఆయన సెంచరీలు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాయి.

తొలి సెంచరీ సమయంలో ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో మ్యాచ్‌ను కాపాడటానికి ఆడిన ఇన్నింగ్స్ ఒకెత్తయితే, వందో సెంచరీ కోసం మీర్పూర్‌లో దేశమంతా ఎదురుచూస్తున్న వేళ ఒత్తిడిని తట్టుకుని ఆడిన తీరు మరొక ఎత్తు. పరిస్థితులు మారినా, వయసు పెరిగినా, ఆకలి మాత్రం తగ్గలేదని సచిన్ నిరూపించారు. అందుకే ఆయన 53వ పుట్టినరోజున కూడా ఆ 100 సెంచరీల రికార్డు చెక్కుచెదరకుండా, ఒక అసాధారణ శిఖరంలా నిలిచింది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe